Indians in Ukraine: ప్రభుత్వ ఖర్చుతో ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి భారతీయులు!

Indians in Ukraine: ఉక్రెయిన్​పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయులను సొంత ఖర్చులతో వెనక్కి రప్పించాలని నిర్ణయించినట్లు తెలిసింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 25, 2022, 04:47 PM IST
  • ఉక్రెయిన్​లో భారతీయులను వెనక్కి రప్పించేందుకు కసరత్తు
  • స్వదేశానికి వచ్చే పౌరులకు కీలక సూచనలు
  • ఖర్చు కూడా భరించేందుకు సిద్ధమైన ప్రభుత్వం!
Indians in Ukraine: ప్రభుత్వ ఖర్చుతో ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి భారతీయులు!

Indians in Ukraine: రష్యా-ఉక్రెయిన్​ యుద్ధ భయాల కారణంగా భారత పౌరులను ఉక్రెయిన్​ నుంచి ఇండియాకు రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఉక్రెయిన్ గగనతలం మూసేయడంతో.. సమీప దేశాల నుంచి ఉక్రెయిన్​లోని భారత పౌరులను స్వదేశానికి తరలించనుంది ప్రభుత్వం.

ఖర్చు ప్రభుత్వానిదే..!

భారత పౌరులను ఉక్రెయిన్ నుంచి సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు గానూ.. ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఇందుకోసమయ్యే ఖర్చును కూడా కేంద్రమే భరించనున్నట్లు తెలుస్తోంది.

'ఉక్రెయిన్​లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేశారు. ఇందుకోసమయ్యే ఖర్చు కూడా ప్రభుత్వమే భరించనుంది' అని విశ్వసనీయ తెలిపినట్లు వార్తా సంస్థ ఏఎన్​ఐతో పేర్కొంది.

తరలింపు ఇలా..

పౌరులను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు గానూ.. ఉక్రెయిన్​లోని భారతీయులకు కీలక సూచనలు చేసింది ప్రభుత్వం. ఉక్రెయిన్​ నుంచి రోడ్డు మార్గం ద్వారా హంగేరీ, రొమానియాలకు చేరుకుని అక్కడి నుంచి.. ప్రత్యేక విమానాల ద్వారా పౌరులను ఇండియాకు తరలించనున్నట్లు తెలిపింది.

ఇందుకోసం ఇండియాకు తిరిగి రావాలనుకునే పౌరులు.. పాస్​పోర్ట్​, డబ్బులు (డాలర్లలో), వ్యాక్సినేషన్ సర్టిఫికెట్​ వంటివి వెంట తెచ్చుకోవాలని సూచించింది. తాము ప్రయాణించే వాహనాలకు భారత జాతీయ జెండాను గానీ... స్టిక్కర్​ను గానీ అతికించుకుని రావాలని సూచించింది. ఎలాంటి ప్రమాదం జరగకుండా ఈ సూచనలు చేసింది.

తెలంగాణ ప్రభుత్వం కూడా..

ఉక్రెయిన్​లో చిక్కుకున్న తెలంగాణ వాసులను వెనక్కి రప్పించేందుకు సహకరించాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్​.. విదేశాంగ మంత్రి జయశంకర్​కు విజ్ఞప్తి చేశారు. ఇందుకు అయ్యే ఖర్చును కూడా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ట్వీట్​ చేశారు.

ఇక దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు ఉక్రెయిన్​లో పై చదువులకోసం వెళ్లారు. యుద్ధ భయాలతో ఇండియాకి తిరికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏ క్షణం ఏం జరుగుతుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో అటు ఉక్రెయిన్​లో చిక్కుకున్న భారతీయులతో పాటు.. ఇండియాలోని వాళ్ల బంధువులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

Also read: Russia Ukraine War: రష్యా యుద్ధ తంత్రం.. మోదీ సాయం కోరిన ఉక్రెయిన్.. జోక్యం చేసుకుంటారా?

Also read: Russia-Ukraine War Effect: ఏప్రిల్ నుంచి భారీగా పెరగనున్న ఎల్పీజీ, సీఎన్జీ గ్యాస్ ధరలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News