బ్రహ్మోస్‌ క్షిపణి ప్రయోగం సక్సెస్

బ్రహ్మోస్‌ క్షిపణి ప్రయోగం విజయవంతమైంది.

Last Updated : May 21, 2018, 04:00 PM IST
బ్రహ్మోస్‌ క్షిపణి ప్రయోగం సక్సెస్

ఒడిశా: బ్రహ్మోస్‌ క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. భారత శాస్త్రవేత్తలు సోమవారం బ్రహ్మోస్‌ క్షిపణిని ఒడిశా తీరంలోని బాలాసోర్ క్షిపణి ప్రయోగ కేంద్రం నుంచి డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించారు. రష్యా-భారత్‌లు సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్‌ వచ్చే దశాబ్దకాలంలో సూపర్ సోనిక్‌ క్షిపణిగా అవతరించనున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

లైఫ్ ఎక్స్‌టెన్షన్ ప్రోగ్రామ్ కింద బ్రహ్మోస్ క్షిపణిని ప్రయోగించారు. బ్రహ్మోస్ జీవిత కాలాన్ని పొడిగిస్తూ రూపొందించిన టెక్నాలజీను భారత్ మొదటిసారి డెవలప్ చేసింది.  బ్రహ్మోస్ లైఫ్‌ను పొడిగించడం వల్ల ఇండియన్ ఆర్మీకి కలిసిరానున్నది.  ఈ పరీక్ష సక్సెస్ కావడం వల్ల మంత్రి నిర్మలా సీతారామన్..  డీఆర్‌డీవోకు కంగ్రాట్స్ చెప్పారు. ఈ టెక్నాలజీతో మిస్సైళ్ల ఖర్చు చాలా వరకు తగ్గుతాయన్నారు.

 

Trending News