India set to cross 100 crore COVID-19 vaccination milestone today, govt plans massive celebrations: దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ (COVID-19 vaccination) మరో కీలక మైలురాయికి చేరనుంది. టీకా కార్యక్రమంలో వినియోగించిన డోసుల సంఖ్య అక్టోబరు 21..గురువారం నాటికి అంటే ఇవ్వాల్టికి 100 కోట్లు దాటనుంది. భారత్ సాధించిన ఈ ఘనతను అంతటా చాటి చెప్పేందుకు కేంద్రం సిద్ధమైంది.
అన్ని రైళ్లలో, మెట్రో రైళ్లలో, విమానాల్లో, షిప్స్‌ల్లో 100 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ విజయాన్ని లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రకటించాలని సర్కారు డిసైడ్ అయ్యింది. అలాగే ఢిల్లీలోని ఎర్రకోట (Red Fort) వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు. ఇక వ్యాక్సినేషన్ (vaccination) 100 కోట్ల డోసులకు చేరిన సందర్భంగా.. సింగర్ కైలాశ్ ఖేర్ ఆలపించిన పాటను, ఒక ఆడియో..విజువల్ ఫిల్మ్‌ను కేంద్ర ఆరోగ్యమంత్రి మన్‌సుఖ్ మాండవీయ (Mansukh Mandaviya) రిలీజ్ చేయనున్నారు. బుధవారం సాయంత్రం నాటికి మన దేశంలో 99.54 కోట్ల డోసులతో వ్యాక్సినేషన్ జరిగింది.
Also Read : Tirumala online darshan tickets : తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల విడుదల తేదీ ప్రకటించిన టీటీడీ
అయితే మన పొరుగుదేశం చైనా 100 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ రికార్డును ( 100 crore COVID-19 vaccination) జూన్‌లో నమోదుచేసింది. ఇప్పుడు దాని తర్వాతి స్థానంలో మన భారత్ నిలవనుంది. ఇక విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు సంబంధించిన కొవిడ్ మార్గదర్శకాలను భారత్ తాజాగా సవరించింది. భారత్‌తో పరస్పర టీకా ఆమోద ఒప్పందాన్ని కుదుర్చుకున్న దేశాలకు ఈ విషయంలో పలు సడలింపులు కల్పించింది. ఈ జాబితాలోని 11 దేశాలు ఉన్నాయి.
బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, నేపాల్, బెలారస్, లెబనాన్, ఆర్మేనియా, ఉక్రెయిన్, బెల్జియం, హంగరీ, సెర్బియా నుంచి వచ్చే వారు రెండు డోసుల టీకా (Two-dose vaccine) తీసుకొని ఉంటే వెంటనే విమానాశ్రయం నుంచి పంపించేస్తారు. ఆర్‌టీ-పీసీఆర్ టెస్ట్ (RT-PCR Test) నెగెటివ్ నివేదికను చూపించాల్సి ఉంటుంది. ఈ మార్గదర్శకాలు భారత్‌లో (India) అక్టోబరు 25 నుంచి అమల్లోకి రానున్నాయి.
Also Read : TDP Leader Pattabhi Arrested : టీడీపీ నేత పట్టాభిని అరెస్టు చేసిన పోలీసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి