India corona Update: దేశవ్యాప్తంగా కరోనా కేసులు మరోసారి తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,650 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు (Corona new cases in India) కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించింది. మొత్తం 11,65,887 మందికి కొవిడ్ టెస్టులకు గానూ..ఈ కేసులు బయటపడినట్లు తెలిపింది.
కరోనా మరణాల్లోనూ క్షీణత నమోదైంది. కొవిడ్ కారణంగా గడిచిన 24 గంటల్లో 374 మంది ప్రాణాలు (Corona Deaths in India) కోల్పోయారు. 7,051 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు.
దేశంలో ఒమిక్రాన్ ఆందోళనలు మాత్రం తీవ్రమయ్యాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం (Omicron cases in India) 158 ఒమిక్రాన్ కేసులు బయపడ్డట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది.
మరిన్ని వివరాలు..
దేశవ్యాప్తంగా ప్రస్తుతం 77,516 యాక్టివ్ కరోనా కేసులు (Corona active cases in India) ఉన్నాయి. దేశంలో కరోనా యాక్టివ్ కేసుల రేటు 0.22 శాతంగా ఉంది.
కరోనా కారణంగా ఇప్పటి వరకు మొత్తం 4,79,133 మంది మృతి చెందారు. దేశంలో కొవిడ్ మరణాల రేటు 1.38 శాతంగా ఉంది.
ఇప్పటి వరకు దేశంలో 34,772,626 మందికి కరోనా సోకగా.. అందులో 3,42,15,977 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో రికవరీ రేటు 98.40 శాతంగా ఉంది.
వ్యాక్సినేషన్ ఇలా..
నిన్న దేశవ్యాప్తంగా (Covid vaccination in India) 57,44,652 డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేశారు. దీనితో ఇప్పటి వరకు దేశంలో ఇచ్చిన మొత్తం వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,40,31,63,063 వద్దకు చేరింది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు ఇలా..
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 278,525,387 మందికి కరోనా (Corona cases world wide) సోకింది. అందులో 5,400,888 మంది మహమ్మారికి బలయ్యారు. 249,203,172 మంది కొవిడ్ నుంచి కోలుకుని బయటపడ్డారు. 23,921,327 మంది ప్రస్తుతం కొవిడ్ చికిత్స పొందుతున్నారు.
Also read: Omicron Scare: అవసరమైతే రాత్రి పూట కర్ఫ్యూ.. రాష్ట్రాలకు కేంద్రం సూచన!
Also read: Omicron Cases in Tamilnadu: తమిళనాడులో ఒక్కరోజే 33 ఒమిక్రాన్ కేసులు నమోదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook