India COVID-19 Cases: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్‌లో వైరస్ వేరియంట్లు పరివర్తనం చెందుతున్నాయి. పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లాక్డౌన్, నైట్ కర్ఫ్యూ, పాక్షిక కర్ఫ్యూ అమలు చేస్తుండటంతో రెండు రోజులపాటు తగ్గినట్లే కనిపించిన కరోనా కేసులు నేడు పెరిగాయి. సోమ, మంగళ వారాల్లో తగ్గిన కరోనా కేసులు నేడు మరోసారి భారీగా నమోదయ్యాయి. కరోనా మరణాలు సైతం మరోసారి 4 వేల మార్క్ దాటిపోయాయి. తద్వారా కరోనా మరణాలు రెండున్నర లక్షల మార్క్ చేరుకున్నాయి.
దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 3,48,421 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి భారత్‌లో ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,33,40,938 (2 కోట్ల 33 లక్షల 40 వేల 9 వందల 38)కు చేరింది. అదే సమయంలో గడిచిన 24 గంటల్లో 4,205 కోవిడ్19 మరణాలు సంభవించాయి. భారత్‌లో ఒక్క రోజు వ్యవధిలో కరోనా మరణాలు నమోదు కావడం ఇదే అత్యధికం. దేశంలో కరోనా బారిన పడి ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 2,54,197కి చేరింది. దేశ వ్యాప్తంగా నిన్న ఒక్కరోజు 3,55,338 మంది కరోనా మహమ్మారిని జయించి ఆరోగ్యంగా డిశ్ఛార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Also Read: Covid-19 Variant: ప్రాణాంతక కరోనా వేరియంట్ 44 దేశాలకు వ్యాపించింది
India reports 3,48,421 new #COVID19 cases, 3,55,338 discharges and 4205 deaths in the last 24 hours, as per Union Health Ministry
Total cases: 2,33,40,938
Total discharges: 1,93,82,642
Death toll: 2,54,197
Active cases: 37,04,099Total vaccination: 17,52,35,991 pic.twitter.com/fMKoTwf0kk
— ANI (@ANI) May 12, 2021
భారత్‌లో ఇప్పటివరకూ కరోనాను జయించిన వారి సంఖ్య 1,93,82,642 (ఒక కోటి 93 లక్షల 82 వేల 6 వందల 42)కి చేరింది. దేశంలో ప్రస్తుతం 37 లక్షల 4 వేల 99 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. వరుసగా రెండో రోజూ దేశంలో పాజిటివ్ కేసుల కన్నా డిశ్ఛార్జ్ కేసులు అధికంగా ఉండటం కాస్త ఊరట కలిగిస్తుంది. మరోవైపు దేశంలో ఇప్పటివరకూ 17 కోట్ల 52 లక్షల 35 వేల 9 వందల 91 మంది కోవిడ్19 టీకాలు తీసుకున్నారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది.
Also Read: Team India ప్లేయర్స్ కేవలం Covishield Vaccine తీసుకుంటున్నారు, కారణమేంటో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook