India Covid-19: 76 లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి.దేశంలో చాలా రోజుల తర్వాత నిన్న 50వేలకు తక్కువగా నమోదైన కేసులు కాస్త మళ్లీ పెరిగాయి. అయితే.. గత కొన్నిరోజులుగా నమోదవుతున్న కేసులు, మరణాలతో పోల్చుకుంటే.. రెండూ కూడా భారీగానే తగ్గయి. 

Last Updated : Oct 21, 2020, 10:32 AM IST
India Covid-19: 76 లక్షలు దాటిన కరోనా కేసులు

India Coronavirus updates: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి.దేశంలో చాలా రోజుల తర్వాత నిన్న 50వేలకు తక్కువగా నమోదైన కేసులు కాస్త మళ్లీ పెరిగాయి. అయితే.. గత కొన్నిరోజులుగా నమోదవుతున్న కేసులు, మరణాలతో పోల్చుకుంటే.. రెండూ కూడా భారీగానే తగ్గయి. ఇంకా ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. దేశంలో కరోనా కేసులకన్నా.. రికవరీ రేటు భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో కరోనా రిక‌వ‌రీ రేటు 88.81 శాతం ఉండగా.. మ‌ర‌ణాల రేటు 1.51 శాతం, యాక్టివ్ కేసుల రేటు 9.67 శాతం ఉన్నట్లు వైద్యశాఖ వెల్లడించింది. Also read: Navratri Day 5: సరస్వతీ నమోస్తుతే.. చదువుల తల్లి అలంకరణలో అమ్మవారు

గత 24 గంటల్లో మంగళవారం ( అక్టోబరు 20న ) దేశవ్యాప్తంగా ( India ) కొత్తగా.. 54,044 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 717 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 76,51,108 కి చేరగా.. మరణాల సంఖ్య 1,15,914 కి పెరిగింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ (Union Health Ministry) బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మంగళవారం కరోనాతో 61,775 మంది కోలుకోగా.. ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారిన పడి 67,95,103 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే ప్రస్తుతం దేశంలో 7,40,090 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు వెల్లడించింది.

ఇదిలాఉంటే.. సోమవారం దేశవ్యాప్తంగా 10,83,608 కరోనా పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ICMR ) వెల్లడించింది. ఈ టెస్టులతో కలిపి అక్టోబరు 20 వరకు మొత్తం 9,72,00,379 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. Also read: Hyderabad Rains: బ్రహ్మాజీకి నెటిజన్ల షాక్.. ట్విట్టర్ నుంచి తప్పుకున్న నటుడు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News