India Covid: దేశంలో కొత్తగా 2487 కరోనా కేసులు నమోదు అయ్యాయి. నిన్నటితో పోల్చితే 371 కేసులు తక్కువ నమోదు కావడం కొంత ఊరటనిచ్చే అంశం. దేశంలో కరోనాతో చనిపోయినవారి సంఖ్య 5 లక్షల 24 వేల 214కి చేరింది. ప్రస్తుతం దేశంలో 17 వేల 692 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 2878 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో కరోనా నుంచి రికవరీ అయినవారి సంఖ్య 4 కోట్ల 25 లక్షల 79 వేల 693కి చేరింది.
#AmritMahotsav#Unite2FightCorona#LargestVaccineDrive
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/kHF9E1JN1W pic.twitter.com/e0e3KDKy3S
— Ministry of Health (@MoHFW_INDIA) May 15, 2022
దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. యాక్టివ్ కేసుల శాతం 0.04 గా నమోదైంది. అటు రోజువారీ పాజిటివిటీ రేటు 0.61 శాతంగా ఉండగా.. వారంతపు పాజిటివిటీ రేటు 0.62 శాతంగా రికార్డైంది. ఇప్పటివరకు 84 కోట్ల 38 లక్షల కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. గడిచిన 24 గంటల్లో 4 లక్షల 5వేల 156 మందికి ఈ పరీక్షలు నిర్వహించారు. అటు దేశంలో 191 కోట్ల 32 లక్షల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.
అమెరికాలో మొత్తంగా ఇప్పటివరకు 8 కోట్ల 24 లక్షల 37వేల 716 కరోనా కేసులు రికార్డు అయ్యాయి. వైరస్ సోకి 9 లక్షల 99 వేల 570 మంది మృతి చెందారు. గడిచిన 28 రోజుల్లోనే అమెరికాలో 11 వేల 185 మంది చనిపోయారు.
Also Read: Trs Fire on BandI Sanjay: సన్యాసుల సంఘానికి అధ్యక్షుడు సంజయ్.. వరంగల్ టీఆర్ఎస్ నేతల ఫైర్
Also Read: Andrew Symonds Death: లెజెండరీ ఆల్‌రౌండర్ సైమండ్స్ టాప్ 5 బెస్ట్ మూమెంట్స్ ఇవే...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి