Schools Reopen: కరోనా సంక్షోభం కారణంగా విద్యకు ఎక్కువగా నష్టం కలిగింది. విద్యార్ధులు చదువుకు దూరమయ్యారు. కరోనా సంక్రమణ తగ్గుముఖం పట్టడంతో స్కూళ్లను తిరిగి తెరిచే విషయమై ఐసీఎంఆర్ కీలక సూచనలు చేసింది.
కరోనా మహమ్మారి(Corona pandemic) దేశంలో అన్ని రంగాల్ని అతలాకుతలం చేసింది. స్కూళ్లు, కళాశాలలు మూతపడటంతో విద్యార్ధులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ ఉధృతి గణనీయంగా తగ్గుతోంది. ఫలితంగా మళ్లీ స్కూళ్లు, కళాశాలల్ని తిరిగి తెరిచేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో స్కూళ్లు, కళాశాలల్ని తెరిచే విషయంలో ఐసీఎంఆర్(ICMR) డైరెక్టర్ డాక్టర్ బలరామ్ భార్గవ్ కీలక సూచనలు చేశారు. ముందుగా ప్రాథమిక పాఠశాలల్ని తెరిస్తే మంచిదని సూచించారు. ఎందుకంటే ఇన్‌ఫెక్షన్‌ను తట్టుకునే సామర్ధ్యం కేవలం చిన్నారులకే ఎక్కువగా ఉందన్నారు. అదే విధంగా టీచర్లందరికీ వ్యాక్సినేషన్ పూర్తయితేనే స్కూళ్లు తెరవాలని చెప్పారు.సెకండరీ పాఠశాలల కంటే ముందు ప్రాథమిక పాఠశాలల్ని ప్రారంభిస్తే మంచిదనే సంకేతాల్ని అటు ప్రభుత్వం కూడా అందించింది. అన్నింటికంటే ముందుగా పాఠశాలల బస్సు డ్రైవర్లు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి వ్యాక్సినేషన్(Vaccination)ముఖ్యమని ఐసీఎంఆర్ డైరెక్టర్ భార్గవ్ తెలిపారు.
దేశంలో త్వరలో 2-18 ఏళ్లవారికి కరోనా వ్యాక్సిన్ అందించే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. భారత్ బయోటెక్(Bharat Biotech)అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ 2-3 దశల ట్రయల్స్ డేటా త్వరలో వెల్లడి కానుంది.
Also read: Karnataka: కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామాకు రంగం సిద్ధం, జూలై 26న రాజీనామా చేసే అవకాశాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook