How to File Consumer Complaint against Restaurants: మీరు ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్‌తో చాలాసార్లు హోటల్స్, రెస్టారెంట్లలో ఫుడ్ తినేందుకు వెళ్లే ఉంటారు. కొన్నిసార్లు హోటల్ ఫుడ్ తినడం వల్ల కొంతమంది అస్వస్థతకు గురైన సంఘటనలు చూసే ఉంటారు. మరికొన్నిసార్లు వడ్డించే ఆహారంలో బల్లులు, బొద్దింకలు, ఇతర కీటకాలు ప్రత్యక్షమైన వార్తలు చదివే ఉంటారు. మీకు ఇలాంటి ఘటనలు ఎదురైతే ఎక్కడ ఫిర్యాదు చేయాలి..? వినియోగదారులకు ప్రత్యేకంగా చట్టాలు ఏమైనా ఉన్నాయా..? వివరాలు ఇలా..
హోటల్, రెస్టారెంట్స్‌లో ఆహారం తినే వారికి కూడా ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. 2006లో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్‌ను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ చట్టం ప్రకారం ఏదైనా హోటల్లో పాడైపోయినా ఆహారాన్ని అందిస్తే వారిపై చర్యలు తీసుకుంటారు. అదేవిధంగా ఈ చట్టంలోని సెక్షన్ 31 ప్రతి రెస్టారెంట్ యజమాని ఆహార అమ్మేందుకు ఫుడ్ లైసెన్స్ తప్పనిసరి ఉండాల్సిందే.
ప్రభుత్వ అధికారికి లైసెన్స్ కోసం రెస్టారెంట్ యజమాని దరఖాస్తు చేసుకోవాలి. ఫుడ్ లైసెన్స్ లేకుండా ఎవరైనా రెస్టారెంట్ నడుపుతుంటే.. ఆరు నెలల జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. గరిష్టంగా రూ.5 లక్షల జరిమానా విధించాలనే నిబంధన కూడా ఉంది. హోటల్లో వడ్డించే ఆహారంలో కల్తీ ఉన్నట్లు తేలితే ఆహార భద్రత, ప్రమాణాల చట్టం 2006లోని సెక్షన్ 54 ప్రకారం.. రెస్టారెంట్ యజమానికి రూ.లక్ష వరకు జరిమానా విధించవచ్చు. మురికి లేదా అపరిశుభ్రమైన వంట గదిలో ఆహారాన్ని వండినా.. లక్ష రూపాయల జరిమానా విధించాలనే రూల్ ఉంది.
ఎలా ఫిర్యాదు చేయాలి..?
==> ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ fssai.gov.in కి వెళ్లాలి.
==> ఆ తరువాత "Share Your Concern" బటన్‌పై క్లిక్ చేయండి. తరువాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
==> రిజిస్ట్రేషన్ తరువాత లాగిన్ చేసి.. ప్యాకేజీ ఫుడ్, ఫుడ్ క్యాటరింగ్ ప్రెమిసెస్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
==> అనంతరం అక్కడ డిస్ ప్లే ఉన్న ఒక ఫారమ్‌ను పూరించండి. సంబంధిత ఫుడ్ ఫొటోను కూడా అప్లోడ్ చేయాలి.
==> ఫారమ్‌ను సక్సెస్‌ఫుల్‌గా సబ్మిట్ చేసిన తరువాత రిఫరెన్స్ నంబర్ వస్తుంది. ఫిర్యాదు స్టాటస్‌ను చెక్ చేసుకోవడానికి ఈ నంబర్‌ను ఉపయోగించాలి.
Also Read: Aadhaar Card Update: ఆధార్ కార్డ్ యూజర్లకు గుడ్‌న్యూస్.. మూడు నెలలు గడువు పెంపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook