Honour killing: మహారాష్ట్రలో పరువు హత్య-యువతి తల నరికి సోదరుడి పైశాచికత్వం...

Honour killing in Maharashtra: ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ యువతిని ఆమె సోదరుడు, తల్లి కలిసి అత్యంత కిరాతకంగా హతమార్చారు. సోదరుడు ఆమె తల నరికి... ఆపై దాన్ని వీధుల్లో ప్రదర్శిస్తూ పైశాచికంగా వ్యవహరించాడు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఈ దారుణం జరిగింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 6, 2021, 03:18 PM IST
  • మహారాష్ట్ర ఔరంగాబాద్‌లో పరువు హత్య
  • యువతి తల నరికి చంపిన సోదరుడు, సహకరించిన తల్లి
  • గర్భవతి అన్న కనికరం లేకుండా దారుణ హత్య
 Honour killing: మహారాష్ట్రలో పరువు హత్య-యువతి తల నరికి సోదరుడి పైశాచికత్వం...

Honour killing in Maharashtra: మహారాష్ట్రలో పరువు హత్య చోటు చేసుకుంది. ప్రేమ పెళ్లి (Love Marriage) చేసుకుందన్న కారణంతో ఓ యువతిని ఆమె సోదరుడు అత్యంత పాశవికంగా హత్య చేశాడు. గర్భవతి (Pregnant) అన్న కనికరం కూడా లేకుండా ఆమె తల నరికి చంపాడు. అనంతరం ఆమె తలను చేతిలో పట్టుకుని ఇంటి నుంచి బయటకొచ్చాడు. వీధిలో అందరూ చూస్తుండగా తలను గాల్లోకి లేపి అటు, ఇటు ఊపుతూ పైశాచికంగా వ్యవహరించాడు. ఈ హత్యకు అతని తల్లి కూడా సహకరించింది. నిందితుడు మైనర్ బాలుడు కావడం గమనార్హం.

పోలీసుల కథనం ప్రకారం... ఔరంగాబాద్ (Aurangabad) జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన కృతి థోరే (19) అనే యువతి ఈ ఏడాది జూన్‌లో తాను ప్రేమించిన వ్యక్తితో కలిసి ఇంటి నుంచి పారిపోయింది. ఇద్దరు పెళ్లి చేసుకుని కలిసి బతుకుతున్నారు. ప్రస్తుతం ఆమె గర్భవతి. ఇదే క్రమంలో గత వారం కృతికి ఆమె తల్లి ఫోన్ చేసింది. జరిగిందేదో జరిగిపోయిందని... ఇద్దరు కలిసి ఒకసారి ఇంటికి రావాలని కోరింది. ఇంతలో కొడుకును తీసుకుని తల్లే ఆదివారం (డిసెంబర్ 5) కూతురి ఇంటికి వెళ్లింది.

తన సోదరుడు, తల్లి ఇద్దరు ఇంటికి వచ్చిన సమయంలో కృతి తన అత్తతో కలిసి పొలంలో పనిచేస్తోంది. ఆ ఇద్దరినీ చూడగానే వెంటనే పరిగెత్తుకొచ్చి వారిని పలకరించింది. అనంతరం వారిని ఇంట్లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టి... ఆమె కిచెన్‌లోకి వెళ్లింది. కిచెన్‌లో కృతి ఛాయ్ ప్రిపేర్ చేస్తున్న సమయంలో.. ఆమె సోదరుడు వెనక నుంచి వచ్చి పదునైన వస్తువుతో బలంగా దాడి చేశాడు. ఆమె తల నరికి అత్యంత దారుణంగా హతమార్చాడు (Murder). ఆ సమయంలో కృతి ప్రతిఘటించకుండా తల్లి ఆమె కాళ్లు అదిమిపట్టుకుంది.

ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న భర్త కిచెన్‌లో వినిపించిన శబ్ధంతో ఉలిక్కిపడ్డాడు. వెంటనే ఆ గదిలోకి వెళ్లి చూడగా అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాక్ తిన్నాడు. కృతి సోదరుడు అతన్ని కూడా చంపేందుకు యత్నించడంతో అక్కడి నుంచి పారిపోయాడు. హత్యానంతరం (Boy beheads sister) కృతి సోదరుడు ఆమె తలను చేతిలో పట్టుకుని ఇంటి నుంచి బయటకొచ్చాడు. అందరూ చూస్తుండగా తలను గాల్లో ఊపుతూ పైశాచికత్వం ప్రదర్శించాడు.  అనంతరం వీర్‌గావ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.

హత్యానంతరం తల్లి, కొడుకు కలిసి కృతి తలతో సెల్ఫీలు దిగారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని స్థానిక పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు. ఔరంగాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ పరువు హత్య (Crime against Women) స్థానికంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది. గతంలోనూ పలుచోట్ల ఇలాంటి ఉదంతాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. పరువు హత్యల నేపథ్యంలో సైరాత్ లాంటి సినిమాలు కూడా వచ్చాయి. 

Also Read: వావ్.. భారత్-న్యూజీలాండ్ ఆటగాళ్ల పేర్లు భలే కలిసాయే! అశ్విన్ నువ్ సూపరో సూపర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News