Haj 2021 guidelines: Online application process begins: న్యూఢిల్లీ: కోవిడ్-19 (Coronavirus) మార్గదర్శకాలతో 2021 హజ్ యాత్ర (Haj 2021) దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. జాతీయ, అంతర్జాతీయ (national-international) మార్గదర్శకాల ప్రకారం.. జూన్-జులై మధ్యలో హజ్ యాత్ర ఉంటుందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ( Mukhtar Abbas Naqvi ) మరోసారి స్పష్టం చేశారు. ముంబైలోని హజ్ హౌస్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో 2021 హజ్ యాత్రకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, తదితర మార్గదర్శకాలను (Haj 2021 guidelines) కేంద్ర మంత్రి నఖ్వీ ప్రకటించారు.
హజ్ (Haj ) యాత్రకు వెళ్లాలనుకునేవారు డిసెంబరు 10 నాటికి ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ లేదా, హజ్ మొబైల్ యాప్ ( Haj Mobile app)లో దరఖాస్తు (application process) చేసుకోవాలని సూచించారు. ఈ హజ్ యాత్ర జూన్-జులై మధ్యలో సౌదీ అరేబియా (Saudi Arabia) మార్గదర్శకాల ప్రకారం ఈ యాత్ర ఉంటుందని ఆయన నఖ్వీ పేర్కొన్నారు. అయితే హజ్ యాత్ర కోసం సౌదీ అరేబియా ప్రయాణానికి ముందు కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్‌ను (Covid-19 certificate) ఖచ్చితంగా సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎంపికైన వారు ప్రతిఒక్కరూ 72 గంటల ముందు విధిగా ఆర్టీపీసీఆర్ కరోనా పరీక్ష చేయించుకొని రిపోర్టును ఇవ్వవలసి ఉంటుందని ఆయన స్పష్టంచేశారు. Also read: Joe Biden: అమెరికన్లందరికీ అధ్యక్షుడిగా ఉంటా: జో బిడెన్
అయతే ఈసారి పురుషుల తోడు లేకుండా ఒంటరిగా వెళ్లాలనుకునే ముస్లిం మహళలకు కూడా హజ్ యాత్రకు అవకాశమివ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. అలాంటి వారినుంచి కూడా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఇదిలాఉంటే.. అంతకుముందు దేశవ్యాప్తంగా ఉన్న 21 హజ్ ఎంబార్కేషన్ పాయింట్లను 10కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. Also read: US Elections: జో బిడెన్, కమలా హారిస్‌కు.. రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe