గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ విజయం తర్వాత ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యకర్తలను ఉద్దేశిస్తూ సోమవారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, 'కమలం' పార్టీ ఎంచుకున్నందుకు మోదీ రెండు రాష్ట్రాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో జీఎస్టీ ప్రభావం కనిపిస్తుందని అన్నారు. కానీ అవేవీ జరగలేదు అన్నారు.
"ఉత్తరప్రదేశ్ పౌర ఎన్నికల నుండి మహారాష్ట్ర ఎన్నికల వరకు, బీజేపీ అద్భుత విజయాలు సాధించింది. ఇటీవల విడుదలైన ఎన్నిక ఫలితాలు సంస్కరణల కోసం దేశం సిద్ధంగా ఉందని నిరూపించాయి" అని మోదీ అన్నారు. హిమాచల్ ప్రదేశ్ ప్రజలు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం చేసే అవినీతికి, దుర్వినియోగాలకు విసుగు చెంది.. మాకు మద్దతు ఇచ్చారని మోదీ అన్నారు.
1995లో గుజరాత్ లో బీజేపీ అధికారంలోకి వచ్చిందని.. అప్పటి నుంచి విజయ పరంపర కొనసాగుతుందని ఆయన అన్నారు. "1989 లోక్ సభ ఎన్నికలలో పోటీ చేసిన అన్ని సీట్లను బిజెపి గెలుచుకుంది. మేము 1990లో పోటీ చేసిన సీట్లలో చాలా వరకు గెలిచాము. 1995లో, 1998లో, 2002లో, 2007లో మరియు 2012 లో మేము గెలిచాము. లోక్ సభ ఎన్నికల్లో మేము చాలా సీట్లు గెలుచుకున్నాము '' అని ఆయన గుర్తుచేశారు. గుజరాత్ ప్రజలు అభివృద్ధిపై ఆరోపణలు చేసిన వారికి (రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ..) గుణపాఠం చెప్పారు .
"గుజరాత్ లో కులతత్వం యొక్క విషాన్ని తొలగించడానికి మాకు మూడు దశాబ్దాలు పట్టింది. మేము సాబ్ కా సాత్, సబ్ కా వికాస్ మార్గంలో గుజరాత్ ను నడిపించాము. దురదృష్టవశాత్తూ, అధికారం కోసం ఆకలితో ఉన్న కొందరు వ్యక్తులు కులతత్వ విత్తనాలను నాటడానికి ప్రయత్నించారు. కానీ గుజరాత్ ప్రజలు ఆ వ్యక్తులను తిరస్కరించారు.
మరోవైపు,పార్టీ అధ్యక్షుడు అమిత్ షా బిజెపి కార్యకర్తల సభలో ప్రసంగిస్తూ.. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ప్రజల పట్ల తన కృతజ్ఞతలను వ్యక్తం చేశారు.