కాంగ్రెస్‌ సెల్ఫ్ గోల్: ఆ రెండు అంశాలే దెబ్బతీశాయి..

Last Updated : Dec 18, 2017, 04:40 PM IST
కాంగ్రెస్‌ సెల్ఫ్ గోల్: ఆ రెండు అంశాలే దెబ్బతీశాయి..

గుజరాత్‌లో అధికారం కోసం కాంగ్రెస్‌ ఏ స్థాయిలో ప్రచారం చేసిందనే విషయం అందరికీ తెలిసిందే. ఏకంగా ఆ పార్టీ అధ్యక్షుడు తన శాయశక్తులు వడ్డి విస్తృత ప్రచారం చేసినా ఫలితం అనుకూలంగా రాలేదంటే కారణం ఏంటి ? ఒక్క బీజేపీలోనే రెబల్స్ తిరుగుబాటు, వివిధ వర్గాల అసంతప్తి, నోట్ల రద్దు, జీఎస్టీ, రిజర్వేషన్ల కోసం పోరుబాట.. ఇలా ఒకటేంటి అనేక అంశాలు బీజేపీని అంతర్గతంగా ఇబ్బంది పెట్టినప్పటికీ కాంగ్రెస్ ఎందుకు గెలువలేపోయిందనే టాక్ బలంగా వినిపిస్తోంది. మరోవైపు మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు యత్నిస్తున్న భాజపాకు ‘అభివృద్ధి’ ఎజెండా తప్ప మరో మార్గం లేదు. ఇలాంటి స్థితిలో కూడా కాంగ్రెస్ గెలవలేకపోయిందనేదానిపైనే ప్రస్తుతం చర్చ నడుస్తోంది. బీజేపీ బలం కంటే..  కాంగ్రెస్‌ సెల్ఫ్‌ గోల్‌ వల్లే ఆ పార్టీ ఓడిపోయిందనే వాదనలూ వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ చేసిన పొరపాట్లను ఒక్కసారి తెలుసుకుందాం.

రవిశంకర్ ‘నీచ్’ వ్యాఖ్యలు: 
గుజరాత్ ఎన్నికల సమయంలో ప్రధాని మోడీని కాంగ్రెస్ నేత రవిశంకర్ అయ్యర్ 'నీచ్' అని సంబోధించారు. దీనిని ప్రధాని మోడీ తన ప్రచార అంశంగా తీసుకొని కాంగ్రెస్ వారు తనను తక్కువ జాతివాడి (నీచ్ ) గా సంభోదిస్తున్నారని విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు. దీనిపై ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తిని ఈ స్థాయిలో దూషించడంపై ప్రజలు కన్నెర్ర చేశారు. దీనికి తోడు ప్రధాని హోదాలో ఉన్న మోడీ గుజరాతీయుడు కావడంతో ఇది మరింత సెంటిమెంట్ గా మారింది. ఇలా మోడీ ప్రజల్లో సానుభూతి సంపాదించడంలో సక్సెస్ అయ్యారు. గుజరాత్ కాంగ్రెస్ ఓటమికి ఈ అంశమే పూర్తి కారణం కాకపోయినప్పటికీ ఇదొక ప్రధాన కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రామ మందిరానికి వ్యతిరేకంగా కపిల్ సిబాల్ వాదన
సుప్రీం కోర్టులో అయోధ్య భూవివాదంపై విచారణ జరగడం భాజపాకు కలిసి వచ్చింది. 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత విచారణ చేపట్టాలన్న కపిల్‌ సిబల్‌ అభ్యర్థనను ఆ పార్టీ తప్పుబట్టింది. ‘ఇక్కడ హిందూ దేవాలయాలను సందర్శిస్తూ.. అక్కడ అయోధ్య ఆలయాన్ని అడ్డుకుంటున్నారు’ అంటూ పల్లవి అందుకుంది. దీనికితోడు సున్నీ వక్ఫ్‌బోర్డు కూడా కపిల్‌ సిబల్‌ వాదనను తప్పుబట్టడం.. ఆయన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ వైఖరిగా భాజపా ప్రచారం చేసింది. పదే పదే ‘మీ వైఖరేంటో చెప్పాలి’ అంటూ ఆ పార్టీని నిలదీసింది. దీన్ని తిప్పికొట్టడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది.. అయితే కపిల్ సిబాల్ అంశం కూడా గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి ప్రధాన కారణమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Trending News