GST Rates Hike: సామాన్యుడికి కేంద్రం షాక్.. నేటి నుంచి పెరగనున్న నిత్యావసరాల ధరలు..!

GST on Food items: సామాన్యులకు కేంద్రం షాకిచ్చింది. నిత్యావసర వస్తువుల ధరలు ఇవాళ్టి నుంచి భారీగా పెంచనుంది. ఇటీవల జరిగిన జీఎస్టీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 18, 2022, 12:38 PM IST
  • నేటి నుండి ఈ ఉత్పత్తులపై జీఎస్టీ మోత
  • పెరుగు, లస్సీ, మజ్జిగపై 5% జీఎస్టీ
GST Rates Hike: సామాన్యుడికి కేంద్రం షాక్.. నేటి నుంచి పెరగనున్న నిత్యావసరాల ధరలు..!

GST Rates hike today: దేశవ్యాప్తంగా పెట్రోల్ , డీజిల్ సహా పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలతో అల్లాడుతున్న సామాన్యుడికి మరో షాక్ తగలనుంది. ఇటీవల నిత్యావసర వస్తువులు మరియు సేవలపై జీఎస్టీని పెంచుతూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) అధ్యక్షతన జరిగిన 47వ జీఎస్టీ సమావేశంలో (47th GST Council Meet) నిర్ణయం తీసుకున్నారు. నేటి నుండే ఈ ధరలు పెరగనున్నాయి. ఇక నుండి  గృహోపకరణాలు, బ్యాంకు సేవలు, ఆసుపత్రులు మరియు హోటళ్ల కోసం ఎక్కువ ఖర్చు చేయవలసి ఉంటుంది. జున్ను, లస్సీ, వెన్న పాలు, ప్యాక్ చేసిన పెరుగు, గోధుమ పిండి, ఇతర ధాన్యాలు, తేనె, పాపడ్, తృణధాన్యాలు, మాంసం మరియు చేపలు, బెల్లం ధరలు సామాన్యుడికి చుక్కలు చూపించనున్నాయి. 

రేట్లు పెరగనున్న వస్తువుల జాబితా
>> ఇప్పటి వరకు పన్ను లేని టెట్రా ప్యాక్ పెరుగు, లస్సీ, మజ్జిగపై 5% జీఎస్టీ విధించారు.
 >> చెక్‌బుక్‌లను జారీ చేయడానికి బ్యాంకులు గతంలో వసూలు చేసే సేవా పన్ను ఇప్పుడు 18 శాతానికి పెరిగింది. 
>> ఆసుపత్రుల్లో రూ.5,000 (నాన్ ఐసీయూ) కంటే ఎక్కువ విలువైన గదులను అద్దెకు ఇస్తే 5 శాతం జీఎస్టీ వసూలు చేయనున్నారు. 
>> అంతేకాకుండా అట్లాస్‌తో కూడిన మ్యాప్‌లకు కూడా 12 శాతం చొప్పున జీఎస్టీ విధించనున్నారు.
>> రోజుకు రూ.1,000 లోపు ఉన్న హోటల్ గదులపై 12 శాతం జీఎస్టీని వసూలు చేయనున్నారు. 
>> ఎల్ఈడీ లైట్లపై  18 శాతం విధించారు. ఇది గతంలో ఉండేది కాదు.  
>> బ్లేడ్లు, పేపర్ కటింగ్ కత్తెరలు, పెన్సిల్ షార్పనర్లు, స్పూన్లు, ఫోర్కులు, స్కిమ్మర్లు మరియు కేక్-సర్వర్లపై గతంలో 12 శాతం జీఎస్టీ ఉండగా... ఇప్పుడు దానిని 18 శాతానికి పెంచారు. 

Also Read: Covid Cases: దేశంలో ప్రమాదకరంగా కొవిడ్ కేసులు.. వరుసగా నాలుగో రోజు 20 వేలకుపైనే.. 

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News