Govt Job Notification: దేశంలో నిరుద్యోగుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. అయితే నిరుద్యోగుల స్థాయిలో కాకున్నా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెగ్యులర్ గా ఉద్యోగాల నోటిఫికేషన్ ను విడుదల చేస్తూనే ఉన్నాయి. దేశ వ్యాప్తంగా అనేక సంస్థల్లో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగస్తులను నింపేందుకు గాను నోటిఫికేషన్ లు జారీ చేయడం జరుగుతుంది.
తాజాగా ఎగ్జామినర్ ఆఫ్ పేటెంట్స్ అండ్ డిజైన్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. qcin.org రిజిస్ట్రర్ చేయించుకోవాల్సి ఉంటుంది. జులై 14న ప్రారంభం అయిన ఈ అప్లికేషన్ ప్రక్రియ ఆగస్టు 4న ముగియబోతుంది. కనుక ఇప్పటికే అర్హులు అప్లై చేయకుంటే వెంటనే చేసుకోండి.
ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పరీక్ష ను సెప్టెంబర్ 3న నిర్వహించబోతున్నారు. మెయిన్ ఎగ్జామ్ ను అక్టోబర్ 1న నిర్వహించబోతున్నట్లుగా కూడా అధికారికంగా ఇప్పటికే ప్రకటన వచ్చింది. మొత్తం 552 పోస్టులు ఉండగా భారీ ఎత్తున ఇప్పటికే అప్లై చేయడం జరిగింది. ప్రణాళికతో చదివితే తప్పకుండా విజయం మీ సొంతం అవుతుంది.
తక్కువ పోస్టులు అనే ఆలోచన లేకుండా మీ వంతు ప్రయత్నం చేయాల్సిందిగా నిపుణులు సూచిస్తున్నారు. భారీ ఎత్తున జీతం అందించే ఈ ఉద్యోగం లో చేరడం ద్వారా జీవితం సెట్ అయినట్లే. అందుకే ప్రతి ఒక్క అవకాశం ను సద్వినియోగం చేసుకుంటూ ప్రయత్నించాల్సిందిగా నిపుణులు తెలియజేస్తున్నారు.
Also Read: Amazon Great Freedom Festival Sale: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ వచ్చేస్తోంది, ఎప్పట్
అభ్యర్థుల వయసు 21 ఏళ్లు నిండి ఉండాలి. అప్లికేషన్ డేట్ వరకు 35 ఏళ్లు పూర్తి అయ్యి ఉండకూడదు. అప్లై చేసే ఉద్యోగం కు అనుసారంగా గుర్తింపు పొందిన యూనివర్శిటీ ద్వారా బ్యాచిలర్ డిగ్రీ.. మాస్టర్స్ డిగ్రీ ని పూర్తి చేయాల్సి ఉంటుంది. జనరల్, ఓబీసీ వారు వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వారు ఇంకా దివ్యాంగులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.
ఇక మొత్తంగా మూడు ఫేజ్ ల్లో ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఆ మూడు ఫేజ్ లను కూడా అభ్యర్థులు క్లీయర్ చేయాల్సి ఉంటుంది. వాటిల్లో ప్రిలిమినరీ, మెయిన్స్ మరియు ఇంటర్వ్యూ. ఈ మూడు దశలు పూర్తి అయిన తర్వాత ఉద్యోగంలో చేరాల్సి ఉంటుంది. ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు రూ.56,100 నుండి రూ. 1,77,500 వరకు జీతం ఉంటుంది. ఎంపిక ప్రక్రియ మొత్తం కూడా ఈ ఏడాది చివరి వరకు పూర్తి అవ్వాల్సి ఉంది.
Also Read: Hyundai Creta: మీకు నచ్చిన హ్యుండయ్ క్రెటా కారు కేవలం 8 లక్షలే ఇప్పుడు, ఎక్కడంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి