అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన గోవా సీఎం మనోహర్ పారికర్

గోవా సీఎం మనోహర్ పారికర్‌కు అస్వస్థత

Last Updated : Sep 14, 2018, 02:51 PM IST
అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన గోవా సీఎం మనోహర్ పారికర్

గురువారం సాయంత్రం అస్వస్థతకు గురైన గోవా సీఎం మనోహర్ పారికర్ ఆస్పత్రిలో చేరారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మనోహర్ పారికర్‌ మరోసారి అస్వస్థతకు గురికావడంతో చికిత్స నిమిత్తం ఆయన్ను ఉత్తర గోవా జిల్లాలోని కండోలిమ్‌లో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయవర్గాలు తెలిపాయి. అయితే, అంతకుమించి ఎక్కువ వివరాలు వెల్లడించడానికి అధికారవర్గాలు నిరాకరించాయి. సీఎం మనోహర్ పారికర్‌ ప్రస్తుతం క్షేమంగానే ఉన్నారని, తాను ఆయన్ను కలిశానని బీజేపీ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ మైఖేల్ లోబో తెలిపారు. ప్యాంక్రియాటిక్ సమస్యతో బాధపడిన పారికర్ అమెరికాలో మూడు నెలలపాటు చికిత్స తీసుకుని సెప్టెంబర్ మొదటివారంలోనే గోవాకు తిరిగొచ్చిన సంగతి తెలిసిందే. 

గోవాకు తిరిగొచ్చినప్పటి నుంటి ఇప్పటివరకు ఆయన ఏ అధికారిక కార్యక్రమాల్లోనూ పాల్గొనలేదు.

Trending News