Fuel prices hiked: రికార్డు స్థాయికి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol prices, Diesel prices today: దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర (Petrol price in Delhi today) 30 పైసలు పెరిగి 103.24  కి చేరింది. ఇక లీటర్ డీజిల్ ధర 35 పైసలు పెరిగిన అనంతరం రూ. 91.77 కి చేరింది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 7, 2021, 04:49 PM IST
  • రోజురోజుకు ఆకాశాన్నంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు (Hike in petrol and diesel prices)
  • పెరుగుతున్న ఇంధనం ధరలను చూసి షాకవుతున్న వాహనదారులు
  • దేశవ్యాప్తంగా రికార్డు స్థాయికి చేరిన పెట్రోల్, డీజిల్ ధరలు (Fuel prices)
Fuel prices hiked: రికార్డు స్థాయికి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol prices, Diesel prices today: పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు గురువారం ఆల్ టైమ్ హై స్థాయికి చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మెట్రో సిటీల్లో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి పెరిగాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరల మాట గుర్తుకొస్తేనే వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో గురువారం పెట్రోల్ ధర లీటర్‌కి 29 పైసలు పెరిగి లీటర్ ధర రూ. 109.25 కి చేరింది. లీటర్ డీజిల్ ధర 38 పైసలు పెరిగి రూ. 99.55 కి చేరింది. 

దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర (Petrol price in Delhi today) 30 పైసలు పెరిగి 103.24  కి చేరింది. ఇక లీటర్ డీజిల్ ధర 35 పైసలు పెరిగిన అనంతరం రూ. 91.77 కి చేరింది.

కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర 29 పైసలు పెరిగి 103.94 మార్క్ (Petrol price in Kolkata today) తాకింది. అలాగే లీటర్ డీజిల్ ధర 35 పైసలు పెరిగిన తర్వాత రూ.94.88 కి చేరింది. 

Also read : Jio Network down: పలు నగరాల్లో నిలిచిపోయిన జియో నెట్‌వర్క్‌ సేవలు, అసహనం వ్యక్తం చేసిన వినియోగదారులు

చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర 26 పైసలు (Petrol price in Chennai today) పెరిగిన అనంతరం రూ.100.75 కి చేరింది. డీజిల్ ధర లీటర్‌కి 33 పైసలు పెరిగి రూ.95.26 కి చేరింది.

చాలా రాష్ట్రాల్లో ఇంధనం ధరలు 100 మార్క్ ఎప్పుడో దాటేశాయి. పెట్రోల్, డీజిల్ ధరలు (Petrol price and diesel prices today) వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఆధారంగా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉన్నాయి.

Also read : Elon Musk: ఎలన్‌ మస్క్‌కి సొంత కంపెనీ నుంచే భారీ షాక్‌, మస్క్‌కు రూ.70 వేల కోట్లదాకా జరిమానా విధించే అవకాశం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News