Bhagat Singh Facts: భగత్​సింగ్ గురించి ఈ నిజాలు మీకు తెలుసా?

Bhagat Singh Facts: భగత్​ సింగ్.. ఈ పేరు ఎంతో మంది యువతకు స్పూర్తినిస్తుంది. మరెంతో మందిలో ధైర్యం నింపుతుంది. భారత స్వేచ్ఛ కోసం పోరాటం చేసి.. అతి చిన్న వయసులో ప్రాణాలు కోల్పోయారు భగత్​. నేడు ఆయన 91వ వర్ధంతి. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 23, 2022, 07:24 PM IST
  • నేడు భగత్​ సింగ్ వర్ధంతి
  • 91 ఏళ్లయినా చరిత్రలో చెరగని ముద్ర
  • కోట్లాది మందికి ఆయనో ఆదర్శం..
Bhagat Singh Facts: భగత్​సింగ్ గురించి ఈ నిజాలు మీకు తెలుసా?

Bhagat Singh Facts: స్వాతంత్ర్యోద్యమం గురించి చర్చ వస్తే.. చాలా మంది పేర్లు గుర్తొస్తాయి. కానీ అతి చిన్న వయస్సులో (23 ఏళ్లు) ఉద్యమం బాట పట్టి. ఆంగ్లేయులకు తలొగ్గకుండా ప్రాణాలు సైతం విడిచిన యోధుడిగా.. భగత్​ సింగ్​కు ప్రత్యేక గుర్తింపు ఉంది.

భగత్ సింగ్ మరణించి నేటికి సరిగ్గా 91 సంవత్సరాలు అయ్యింది. అయినా ఇప్పటికీ కోట్లాది మంది యువతకు ఆయనో ఆదర్శం. ఆయన తెగువ ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది అనడంలో సందేహం లేదు. భగత్​ సింగ్ వర్ధంతి సందర్భంగా.. ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

భగత్ సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..

1. జలియన్ వాలాబాగ్ హింసాకాండ భగత్​ సింగ్​పై తీవ్రంగా ప్రభావం చూపింది. ఈ ఘటననే ఆయన్ను స్వాతంత్ర్యోద్యమం వైపు అడుగులు వేసేలా చేసింది. ఈ ఘటన జరిగినప్పుడు ఆయన వయస్సు 12 ఏళ్లు మాతమే. బడికి వెళ్లకుండా.. ఆ రక్తపాతం జరిగిన చోటుకు వెళ్లి పరిశీలించే వారు.

2. చిన్నప్పుడే భగత్​ సింగ్​కు గన్స్​ గురించి మాట్లాడేవారు. పొలాల్లో గన్స్​ పెంచాలని ఆయన భావించే వారు (చిన్నప్పుడు). వాటితో బ్రిటీష్​ వాళ్లపై యుద్ధం చేయొచ్చని భావించేవారు.

3. భగత్ సింగ్ సిక్కు కుటుంబంలో జన్మించారు. అయినప్పటికీ బ్రిటీష్​ అధికారిని చంపిన కేసులో.. అరెస్ట్​ చేయకుండా, గుర్తించడానికి వీలు లేకుండా.. లహోర్​ను వీడి కోల్​కతాకు తప్పించుకునేందుకు గడ్డం గీసుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం వంటి పనులు చేశారు.

4. భగత్​ సింగ్ కాలేజీలో చదువుకునే సమయంలో మంచి నటుడు కూడా. రాణా ప్రతాప్​, సామ్రాట్​ చంద్రగుప్త, భరత్ దుర్దశ వంటి నాటకాల్లో నటించారు. ఆయన నటనా ప్రావిణ్యంతో ప్రజలను బ్రటీషర్ల​పై తిరుగుబాటు చేసేలా ప్రేరేపించే వారు.

5.భగత్​ సింగ్​కు మార్చి 1931 మార్చి 24 ఉరి శిక్ష విధించాలని అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఆ తర్వాత దానిని 11 గంటల ముందుగా.. అంటే 1931 మార్చి 23 రాత్రి 7.30కి అమలు చేశారు. ఆయనను బ్రిటీషర్లు ఉరి తీసినప్పుడు ఆయన వయసు కేవలం 23 ఏళ్లు.

Also read: Paddy Procurement: ముదురుతున్న వరి వివాదం.. లేటెస్ట్ అప్డేట్

Also read: Covid-19 Guidlines: కరోనాపై కొత్త మార్గదర్శకాలని జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News