Uttar Pradesh Accident: పండగ రోజున యూపీ(Uttar Pradesh)లోని ఝాన్సీ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Accident) జరిగింది. ఈ ఘటనలో 11 మంది మరణించారు. మృతుల్లో నలుగురు చిన్నారులు, ఏడుగురు మహిళలు ఉన్నారు. గాయపడిన ఆరుగురిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మధ్యప్రదేశ్(Madhyapradesh)లోని పండోఖర్ నుంచి చిర్గావ్కు 30 కుటుంబాలకు చెందిన భక్తులు ట్రాక్టర్(Tractor)లో వెళ్తుండగా ఈ దుర్ఘటన సంభవించింది. వీరంతా దసరా సందర్భంగా అమ్మవారి దర్శనానికి వెళ్లి వస్తున్నట్లు తెలిసింది.'వేగంగా వెళ్తున్న ట్రాక్టర్‌కు ఓ జంతువు అడ్డుగా వచ్చింది. దానిని తప్పించే క్రమంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీనితో ట్రాలీ అదుపుతప్పి బోల్తాపడింది' అని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
Also read: Afghanistan Blast: అఫ్గాన్‌లో మరో భారీ పేలుడు...16 మంది మృతి!
సమాచారం అందిన వెంటనే చేరుకున్న పోలీసులు.. స్థానికులతో తోడ్పాటుతో సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్(UP CM Yogi Adityanath) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకునేందుకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి