ఏసీ రైలు ప్రయాణం కన్నా విమానమే మిన్న

                                   

Last Updated : May 29, 2018, 01:36 PM IST
ఏసీ రైలు ప్రయాణం కన్నా విమానమే మిన్న

మిడిల్ క్లాస్ ప్రయణికులు రైలు కన్నా విమాన ప్రయాణానికే మొగ్గు చూపుతున్నారు. సాధారణంగా మధ్యతరగతి వారు సౌకర్యవంతమైన ప్రయాణం కోసం ఏసీ రైళ్ల కు ఇప్పటి వరకు ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. అయితే గత నాలుగేళ్ల నుంచి ట్రెండ్  మారింది. ఏసీ రైలు టికెట్ కు విమాన ప్రయాణానికి పెద్ద తేడా లేకపోవడంతో సగటు ప్రయాణికుడు విమాన ప్రయాణానికే మొగ్గుచూపుతున్నారు. 

మోడీ సర్కార్ ఏర్పడి నాలుగేళ్ల పూర్తయిన సందర్భంగా కేంద్రం ఓ రిపోర్టును విడుదల చేయగా అందులో ఈ విషయం వెల్లడైంది. భారత దేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద పౌర విమానయాన మార్కెట్ గా అభివృద్ధి చెందుతోందని ఈ  రిపోర్టు పేర్కొన్నారు.గత నాలుగేళ్ల వ్యవధిలో రైళ్లలోని ఏసీ కోచ్ ప్రయాణికుల సంఖ్యను విమాన ప్రయాణికుల సంఖ్య దాటేసిందని తెలిపింది. 

గత నాలుగేళ్లలో దేశ వ్యాప్తంగా కొత్త ఎయిర్ పోర్టులు ఏర్పాటు చేయడం. పలు విమానయాన సంస్థలను అభివృద్ధి చేయడం వంటి చర్యలతో విమాన సర్వీసుల సంఖ్య పెరిగిందని రిపోర్టులో పేర్కొన్నారు. దీంతో పాటు ప్రయాణికుల రద్దీ 20  శాతం మేరకు పెరిగిందని తెలిపింది. ప్రస్తుతం ఉన్న వార్షిక విమాన ప్రయాణికుల సంఖ్య (20 కోట్లు ) ను వచ్చే 20 ఏళ్లలో ఐదు రెట్లు (100 కోట్లు) పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం తన నివేదికలో వెల్లడించింది.

Trending News