Election Result 2022: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రేపు రాబోతున్నాయి. మరికొద్ది గంటల్లో నేతల భవిత్యవం తేలనుంది. కౌంటింగ్‌కు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు అధికారులు. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ రావడంతో విజయం ఎవరికి వరిస్తోందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
దేశంలో మిని సంగ్రామం ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు గురువారం రానున్నాయి.
యూపీ, పంజాబ్ రాష్ట్రాల ఎన్నికలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ రావడంతో మరింత ఆసక్తి నెలకొంది. ప్రచారంలో ప్రధాన పార్టీలన్నీ హోరాహోరీ తలపడ్డాయి. విజయం తమదేనని స్పష్టం చేశాయి. యూపీలో బీజేపీ, ఎస్పీ పార్టీలు నువ్వానేనా అన్నట్లు ప్రజల్లోకి వెళ్లాయి.
ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాల్లో 690 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 7 దశల్లో ఎన్నికలను నిర్వహించారు. యూపీలో 403, పంజాబ్‌లో 117, గోవాలో 40, మణిపూర్‌లో 28, ఉత్తరాఖండ్‌లో 70 స్థానాలకు గురువారం ఫలితాలు రానున్నాయి.
ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి..?
సోమవారం చివరి దశ పోలింగ్ ముగియగానే ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ భారీ విజయం ఖాయమని పలు సర్వేలు స్పష్టం చేశాయి. పంజాబ్‌లో ఆప్ అధికారంలోకి వస్తుందని తెలిపాయి. పంజాబ్, ఉత్తరాఖండ్‌ల్లో కాంగ్రెస్‌కు ఘోర పరాజయం తప్పదని తేల్చి చెప్పాయి సర్వేలు. గోవాలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాదని తెలిపాయి.
కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి..
గురువారం జరగనున్న కౌంటింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వార్ రూమ్ నుంచి ఈవీఎంలను కౌంటింగ్ కేంద్రాలకు తరలించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరకుండా పోలీసులను మోహరించారు. ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
Also read: CM Bhupesh Baghel: బడ్జెట్ పత్రాలను 'ఆవు పేడ' సూట్‌కేస్‌లో తీసుకెళ్లిన సీఎం, ఫోటోలు వైరల్
Also read: Indian Railways: ఒకటి, రెండు కాదు ఏకంగా పూర్తిగా రైలునే బుక్ చేసుకోవచ్చు.. అదెలాగంటారా.. ??
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Election results 2022: రేపే ఎన్నికల ఫలితాలు- యూపీ, పంజాబ్‌పైనే అందరి చూపు..
రేపే మినీ సంగ్రామం ఫలితాలు
యూపీపైనే అందరి చూపు..
పంజాబ్‌లో అధికారం చేతులు మారే అవకాశం