Farmer protests Updates: న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను ( Farm laws ) రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు ( Farmer Agitation ) చేస్తున్న ఆందోళన ఆదివారంతో 39వ రోజుకు చేరింది. ఒకవైపు తీవ్రమైన చలిలో, మరోవైపు వర్షంలో రైతులు ఏమాత్రం వెనకడుగు వేయకుండా తమ నిరసనను కొనసాగిస్తున్నారు. ఢిల్లీ శివార్లలోని సింఘు, టిక్రీ, ఘాజీపూర్, చిల్లా, పల్వాల్ తదితర చోట్ల రైతులు ఆందోళన చేస్తున్నారు.
Delhi: Protesters remove rainwater from their camps at Singhu (Delhi-Haryana) border where protest against Centre's farm laws entered 39th day.
A protester says,"Rainfall is good for our crops. When we work in our fields we get wet, it doesn't matter if we've to face rain here." pic.twitter.com/e9GpF53mHp
— ANI (@ANI) January 3, 2021
ఢిల్లీ (Delhi) లో ఆదివారం ఉదయం భారీ వర్షం (Heavy Rain) కురిసింది. అయినప్పటికీ రైతులు తమ గుడారాల్లో చేరి ఆందోళన చేస్తున్నారు. తీవ్రమైన చలి, వర్ష కురుస్తున్నా.. తమకేం కాదని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చట్టాలను రద్దు చేసే వరకు ఇక్కడినుంచి కదిలేది లేదని.. అప్పటివరకు నిరసనను కొనసాగిస్తామని రైతులు పేర్కొంటున్నారు. గుడారాల్లోకి చేరిన వర్షపు నీటిని తొలగిస్తున్నారు. Also read: COVID-19 Vaccine: ప్రతీ భారతీయుడికి గర్వకారణం: ప్రధాని మోదీ
Delhi: Rainwater entered camps of farmers protesting at Burari ground; a protester says, "Government is not listening to us, we'll continue our agitation." pic.twitter.com/r5UDdZScLJ
— ANI (@ANI) January 3, 2021
ఇదిలాఉంటే.. సోమవారం కేంద్ర ప్రభుత్వం (Central Government), రైతు సంఘాల మధ్య ఏడో దఫా చర్చలు జరగనున్నాయి. ఈసారి జరిగే చర్చలు సఫలం కాకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని రైతులు ప్రకటించారు. ఈ మేరకు జనవరి 6న ట్రాక్టర్ల ర్యాలీ, జనవరి 26న ట్రాక్టర్లతో కిసాన్ మార్చ్ నిర్వహించాలని రైతు సంఘాలు (Farmers Organizations) ఇప్పటికే నిర్ణయించాయి. Also Read: COVID-19 Vaccine: కోవిషీల్డ్, కోవ్యాక్సిన్‌కు డీజీసీఐ గ్రీన్ సిగ్నల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook