Farmers protest: రైతు ఉద్యమం మరింత ఉధృతం, 18న దేశవ్యాప్తంగా రైల్ రోకో

Farmers protest: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన మరింత ఉధృతం కానుంది.  రైతుల ఉద్యమాన్ని బలహీనపర్చే చర్యల్ని ఖండిస్తూ..దేశవ్యాప్తంగా రైల్ రోకోకు పిలుపునిచ్చాయి రైతు సంఘాలు

Last Updated : Feb 15, 2021, 07:49 PM IST
Farmers protest: రైతు ఉద్యమం మరింత ఉధృతం, 18న దేశవ్యాప్తంగా రైల్ రోకో

Farmers protest: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన మరింత ఉధృతం కానుంది.  రైతుల ఉద్యమాన్ని బలహీనపర్చే చర్యల్ని ఖండిస్తూ..దేశవ్యాప్తంగా రైల్ రోకోకు పిలుపునిచ్చాయి రైతు సంఘాలు

కేంద్ర ప్రభుత్వం ( Central government ) తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల ( New farm laws )కు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన ( Farmers protest ) కొనసాగుతోంది. రైతుల ఆందోళనకు మద్దతుగా పర్యావరణ  కార్యకర్త దిశ రవి టూల్‌కిట్ రూపొందించడంతో ఢిల్లీ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. రైతు సంఘాలు ఈ అరెస్టును తీవ్రంగా ఖండించాయి. పోలీసులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని సంయుక్త కిసాన్ మోర్చా ఆరోపించింది. రైతు ఉద్యమాన్ని బలహీనపర్చే చర్చలకు ఢిల్లీ పోలీసులు పాల్పడుతున్నారని రైతులు మండిపడ్డారు. 

రైతుల ఉద్యమాన్ని బలహీనపరిచే ప్రయత్నంలో ప్రభుత్వం పోలీసుల అధికారాన్ని దుర్వినియోగం చేయడంపై సంయుక్త కిసాన్‌ మోర్చా తీవ్ర ఆందోళన చెందుతోంది. యువ పర్యావరణ కార్యకర్త దిశ రవిని సరైన విధానాలు పాటించకుండా అరెస్టు చేయడాన్ని ఖండించింది. తక్షణం ఆమెను బేషరతుగా విడుదల చేయాలని ఎస్‌కేఎం డిమాండ్ చేస్తోంది. అంతేగాక ఈ నెల 18న దేశవ్యాప్తంగా నాలుగు గంటలపాటు రైల్‌ రోకో ( Rail Roko )కు సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపునిచ్చింది. మరోవైపు కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ కూడా దిశ అరెస్టును ఖండించింది. రైతు ఉద్యమానికి భయపడిన మోదీ ప్రభుత్వం..21 ఏళ్ల యువతిని అరెస్టు చేయడం ద్వారా మానవాళినే చంపుతోందని కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ విమర్శించింది. ఢిల్లీలో జనవరి 26న జరిగిన హింసాకాండను ప్రసారం చేసిన  పలువురు జర్నలిస్టులపై నమోదు చేసిన దేశద్రోహం కేసుల్ని ఉపసంహరించుకోవాలని రైతు నేతలు కోరుతున్నారు.  

ఫిబ్రవరి 18న దేశవ్యాప్తంగా రైల్ రోకో చేయాలని రైతు సంఘాలు నిర్ణయించిన నేపధ్యంలో రైల్వే శాఖ, పోలీసులు అప్రమత్తమవుతున్నారు. అటు రైల్ రోకో ( Rail roko )ను జయప్రదం చేసేందుకు రైతు సంఘాలు ప్రణాళికలు రచిస్తున్నాయి.

Also read: EPFO: 40 లక్షల మంది EPF ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ షాకింగ్ న్యూస్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News