Farmers protest: రైతు ఆందోళన ఇక మరింత ఉధృతం, సుదీర్ఘ పోరు కోసం కార్యాచరణ ప్రకటన

Farmers protest:కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై ఆందోళన ఆగేలా కన్పించడం లేదు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన ఉధృతం చేయాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. సుదీర్ఘపోరులో భాగంగా కార్యాచరణ ప్రకటించాయి.

Last Updated : Feb 22, 2021, 07:52 AM IST
  • మరింత ఉధృతం కానున్న రైతుల ఆందోళన, కార్యాచరణ ప్రకటించిన సంయుక్త కిసాన్ మోర్చా
  • ఫిబ్రవరి 23 నుంచి 27వ తేదీ వరకూ వరుస కార్యక్రమాల నిర్వహణ
  • రైతు చట్టాల్ని రద్దు చేసేంతవరకూ ఆందోళన ఆగదని స్పష్టం చేసిన రైతు సంఘాలు
 Farmers protest: రైతు ఆందోళన ఇక మరింత ఉధృతం, సుదీర్ఘ పోరు కోసం కార్యాచరణ ప్రకటన

Farmers protest:కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై ఆందోళన ఆగేలా కన్పించడం లేదు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన ఉధృతం చేయాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. సుదీర్ఘపోరులో భాగంగా కార్యాచరణ ప్రకటించాయి.

ఢిల్లీ సరిహద్దుల్లో ప్రారంభమైన రైతుల ఆందోళన ఇక ఉధృతం కానుంది. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతన్నలు తలపెట్టిన ఆందోళనను ఉధృతం చేసేందుకు రైతు సంఘాలు నిర్ణయించాయి. ఈ మేరకు రైతు సంఘాల ఉమ్మడి వేదిక సంయుక్త  కిసాన్ మోర్చా( Joint kissan morcha) ప్రకటించింది. దాదాపు 3 నెలల క్రితం ప్రారంభమైన రైతు ఆందోళన ( Farmers protest ) ఇప్పటికే పలు దశల్ని దాటింది. భారత్ బంద్, రహదారుల దిగ్భంధనం తరువాత గణతంత్ర దినోత్సవాన జరిగిన రైతుల ట్రాక్టర్ ర్యాలీ ఉద్యమాన్ని పరాకాష్ఠకు తీసుకెళ్లింది. ఓ విధంగా చెప్పాలంటే అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. రిపబ్లిక్ డే నాడు జరిగిన ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా ఎర్రకోట ముట్టడించడం, హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో కొన్ని రైతు సంఘాలు ఆందోళన నుంచి తప్పుకున్నాయి. అంతర్జాతీయ మద్దతు కూడా ట్రాక్టర్ ర్యాలీ ఘటనతోనే సాధ్యమైంది. 

ఈ నేపధ్యంలో కొత్త రైతు చట్టాలకు( New farm laws)వ్యతిరేకంగా ఆందోళనను ముమ్మరం చేసేందుకు రైతు సంఘాలు ( Farmer unions)ప్రణాళిక రచించాయి. ఇందులో భాగంగా ఈ నెల 23 వ తేదీ నుంచి 27వ తేదీ వరకూ చేపట్టాల్ని పోరాట కార్యాచరణను ప్రకటించాయి రైతు సంఘాలు. ప్రభుత్వ అణచివేతకు నిరసనగా 23వ తేదీన పగడీ సంభాష్ దివస్,  24వ తేదీన దామన్ విరోధి దివస్ నిర్వహించనున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా వెల్లడించింది. అదే విధంగా 26వ తేదీన యువ కిసాన్ దివస్, 27వ తేదీన మజ్దూర్ కిసాన్ ఏక్తా దివస్ నిర్వహించనున్నారు. కొత్త సాగు చట్టాలు రద్దయ్యే వరకూ సుదీర్ఘ పోరాటానికి సిద్ధమని రైతు సంఘాలు స్పష్టం చేశాయి. కొత్త రైతు చట్టాలు రైతులకు డెత్ వారెంట్లని డిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ( Delhi cm Arvind kejriwal)అభివర్ణించారు. కొత్త రైతు చట్టాల్ని అమలు చేస్తే దేశంలోని వ్యవసాయం మొత్తం కార్పొరేట్ వ్యాపారుల చేతుల్లో వెళ్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. 

Also read: Chandrayaan 3: చంద్రయాన్ 3కు సిద్ధమౌతున్న ఇస్రో, 2022లో ప్రయోగం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News