EPFO Jobs 2025: రాత పరీక్ష లేకుండానే 65 వేల జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా అప్లై చేయాలి

EPFO Jobs 2025: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కొలువుదీరనున్నాయి. అది కూడా ఎలాంటి రాత పరీక్ష లేకుండానే. ఈ ఉద్యోగాలకు అర్హత ఏంటి, జీతం ఎంత ఉంటుంది ఇతర వివరాలు మీ కోసం

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 26, 2025, 06:31 PM IST
EPFO Jobs 2025: రాత పరీక్ష లేకుండానే 65 వేల జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా అప్లై చేయాలి

EPFO Jobs 2025: కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ రిక్రూట్‌మెంట్ చేపట్టింది. ఈపీఎఫ్ఓ లీగల్ విభాగంలో ప్రొఫెషనల్స్ నియామకం చేపడుతోంది. ఆసక్తి కలిగిన అర్హత కలిగిన అభ్యర్ధులు ఈపీఎఫ్ఓ అధికారిక పోర్టల్ epfindia.gov.in. ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అనేది దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో శాఖలు కలిగిన కేంద్ర ప్రభుత్వ సంస్థ. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగుల పీఎఫ్, పెన్షన్ వ్యవహారాలు చూస్తుంది. ఇందులో ఇప్పుడు భారీగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. లీగల్ విభాగంలో ప్రొఫెషనల్స్ నియామకం కోసం ఇవాళ్టి నుంచి దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్‌లో ప్రారంభమైది. ఇవాళ్టి నుంచి 21 రోజుల వరకూ దరఖాస్తు చేసేందుకు గడువు ఉంటుంది. లీగల్ విభాగంలో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగాలకు కావల్సిన గరిష్ట వయస్సు పరిమితి 32 ఏళ్లు.మీ వయస్సు 32 ఏళ్లలోపుంటేనే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. 

ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఎల్ఎల్‌బి లేదా బీఎల్ డిగ్రీ ఉండాలి. ఎంపికైన అభ్యర్ధులకు జీతం నెలకు 65 వేల రూపాయలుంటుంది. ఇక ఎంపిక ప్రక్రియ పూర్తిగా విద్యార్హత, అనుభవం ఆధారంగా ఉంటుంది. ఎలాంటి రాత పరీక్ష ఉండదు. విద్యార్హత, అనుభవ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్ధులకు నేరుగా ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ ద్వారా సదరు అభ్యర్ధి నైపుణ్యం, అర్హత ఉందా లేదా అనేది పరిశీలిస్తారు. 

ఎలా అప్లై చేయాలి, ఏయే డాక్యుమెంట్లు సమర్పించాలి వంటి పూర్తి వివరాల కోసం ఈపీఎఫ్ఓ పోర్టల్ epfindia.gov.in. సందర్శించాలి. దరఖాస్తు కూడా ఇదే పోర్టల్ ద్వారా చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసేవారికి ఇది మంచి అవకాశం. 

Also read: February 2025 Bank Holidays: ఫిబ్రవరిలో ఆ 14 రోజులు సెలవులే, జాబితా ఇదిగో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News