చత్తీస్‌ఘడ్‌పై ఓ కన్నేయాల్సిందిగా ఒడిషాను కోరిన ఈసీ

చత్తీస్‌ఘడ్‌పై ఓ కన్నేయాల్సిందిగా ఒడిషాను కోరిన ఈసీ    

Last Updated : Nov 8, 2018, 12:53 PM IST
చత్తీస్‌ఘడ్‌పై ఓ కన్నేయాల్సిందిగా ఒడిషాను కోరిన ఈసీ

చత్తీస్‌ఘడ్‌పై ఓ కన్నేయాల్సిందిగా ఒడిషా సర్కార్‌కు కేంద్ర ఎన్నికల కమిషన్ ఓ లేఖ రాసింది. ఒడిషాకు ఆనుకుని ఉన్న చత్తీస్‌ఘడ్‌లో త్వరలోనే ఎన్నికలు జరగనునన్న నేపథ్యంలో చత్తీస్‌ఘడ్‌ సరిహద్దుల్లో రవాణామార్గాలపై నిఘా పెంచాల్సిందిగా కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ లేఖలో పేర్కొంది. 

ఓటర్లను ఊరించేందుకు ఒడిషా మీదుగా చత్తీస్‌ఘడ్‌లోకి ఏమైనా ధనం కానీ లేక ఇతర వస్తుసామాగ్రి తరలించే అవకాశం లేకపోలేదని, అందువల్లే ఈ ఒడిషాకు ఈ సూచనలు చేస్తున్నామని కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ లేఖలో స్పష్టంచేసినట్టు సమాచారం.

Trending News