2 DG Medicine: 2 డీజీ మందును ఎవరు వాడాలి, ఎవరు వాడకూడదో తెలుసా

2 DG Medicine: కరోనా మహమ్మారి చికిత్సలో కొత్తగా అందుబాటులో వచ్చిన 2 డీజీ మెడిసిన్‌కు సంబంధించి కీలకమైన అప్‌డే‌ట్స్ వచ్చాయి. మందును అభివృద్ధి చేసిన డీఆర్డీవో పలు సూచనలు జారీ చేసింది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 1, 2021, 05:29 PM IST
2 DG Medicine: 2 డీజీ మందును ఎవరు వాడాలి, ఎవరు వాడకూడదో తెలుసా

2 DG Medicine: కరోనా మహమ్మారి చికిత్సలో కొత్తగా అందుబాటులో వచ్చిన 2 డీజీ మెడిసిన్‌కు సంబంధించి కీలకమైన అప్‌డే‌ట్స్ వచ్చాయి. మందును అభివృద్ధి చేసిన డీఆర్డీవో పలు సూచనలు జారీ చేసింది.

కరోనా వైరస్ మహమ్మారికి(Corona Pandemic) చెక్ పెట్టేందుకు డీఆర్డీవో- డాక్టర్ రెడ్డీ ల్యాబ్స్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన 2 డీజి మెడిసిన్ అధ్బుత ఫలితాలనిస్తోందని తెలుస్తోంది. డీసీజీఐ అనుమతి సైతం లభించడంతో డాక్టర్ రెడ్డీ ల్యాబ్స్ ఈ మందును ఉత్పత్తి చేసి విక్రయిస్తోంది. ఈ నేపధ్యలో అసలీ మందు ఎవరు వాడాలి..ఎవరు వాడకూడదనే విషయంపై డీఆర్డీవో(DRDO) కీలకమైన సూచనలు జారీ చేసింది. 2డిజి ఔష‌ధాన్ని కోవిడ్ బారిన ప‌డి చికిత్స పొందుతున్న వారు ఉప‌యోగించాలి. డాక్ట‌ర్ ప్రిస్క్రిప్ష‌న్ ఉంటేనే ఈ మందును కొనుగోలు చేయాల్సి ఉంటుంది. హాస్పిట‌ళ్ల‌లో చికిత్స పొందే కోవిడ్ బాధితుల‌కు మాత్ర‌మే ఈ మందును అందిస్తారు. సాధార‌ణ చికిత్స‌తోపాటు ఈ మందును ఇవ్వాల్సి ఉంటుంది.

కోవిడ్ మ‌ధ్య‌స్థ ల‌క్ష‌ణాలు ఉన్న రోగులు 10 రోజుల వ‌ర‌కు 2 డీజి మెడిసిన్ ( 2 DG Medicine) ను ఉప‌యోగించ‌వ‌చ్చు. దీంతో ప‌రిస్థితి తీవ్ర‌త‌రం కాకుండా ఉంటుంది. రోగుల‌ను ప్రాణాపాయం నుంచి ర‌క్షించ‌వ‌చ్చు. డ‌యాబెటిస్‌, కార్డియాక్ స‌మ‌స్య‌లు, ఏఆర్‌డీఎస్‌, హెపాటిక్‌, రెనాల్ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు వైద్యుని సూచన మేరకు మందు వాడాల్సి ఉంటుంది. 

ఇక 18 ఏళ్ల లోపు వ‌య‌స్సువారు, గ‌ర్భిణీలు, పాలిచ్చే త‌ల్లుల‌ు ఈ మెడిసిన్‌ వాడకూడదు. ఈ మందు కోసం కోవిడ్ బాధితులు చికిత్స పొందే హాస్పిట‌ల్‌ను గానీ, రెడ్డి ల్యాబ్స్(Dr Reddys labs) హైద‌రాబాద్ శాఖ‌ను గానీ సంప్ర‌దించాలి. మెడిసిన్ కోసం బాధితులు లేదా వారి కుటుంబ స‌భ్యులు, బంధువులు 2DG@drreddys.com అనే మెయిల్‌కు రిక్వెస్ట్ పెట్టాలి. దీంతో బాధితులు చికిత్స పొందుతున్న హాస్పిట‌ల్‌కు నేరుగా ఈ మెడిసిన్‌ అందుతుంది. ఈ మందుకు చెందిన ఒక సాచెట్ ధ‌ర 990 రూపాయులుంది. ఈ మందును తీసుకున్న కరోనా బాధితులు త్వరగా కోలుకుంటున్నారని..ఆక్సిజన్‌పై ఆధారపడటం తగ్గుతుందని క్లినికల్ ట్రయల్స్‌లో వెల్లడైంది. 

Also read: Liquor Door Delivery: ఢిల్లీలో ఇక ఇంటికే మద్యం డోర్ డెలివరీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News