Delhi Police Received Bomb Threatening Calls: ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో దేశ రాజధానిలోని పలు ప్రాంతాల్లో గుర్తుతెలియని బ్యాగులు గుర్తించినట్టుగా పేర్కొంటూ ఢిల్లీ పోలీసులకు పలు ఫోన్ కాల్స్ రావడం కలకలం సృష్టించింది. దేశ రాజధానిలోని శ్రమ శక్తి భవన్, కశ్మీర్ గేట్, ఎర్రకోట అలాగే సరితా విహార్ వంటి ప్రాంతాల్లో గుర్తుతెలియని బ్యాగులు ఉన్నాయనేది ఆ ఫోన్ కాల్స్ సారాంశం.
శ్రమశక్తి భవన్ సమీపంలో గుర్తించిన బ్యాగుని పోలీసులు, బాంబ్ స్క్వాడ్ బృందాలు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆ బ్యాగులో అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని గుర్తించిన పోలీసులు.. ఆ బ్యాగ్ ఒక స్థానిక ఎలక్ట్రీషియన్‌కు చెందినది అని తేల్చేశారు. అనంతరం ఆ బ్యాగ్‌ని అతడికి అప్పగించినట్లు ఢిల్లీ సీనియర్ పోలీసు అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. బ్యాగ్‌లో ఎలక్ట్రికల్ పనులకు ఉపయోగించే పనిముట్లు మాత్రమే ఉండటంతో అందరూ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.
అలాగే కశ్మీరీ గేట్, రోడ్ ఫోర్ట్, సరితా విహార్ ప్రాంతాల్లో లభించిన బ్యాగులను సైతం బాంబ్ స్క్వాడ్ బృందాల సహాయంతో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కానీ ఎక్కడా, ఏదీ కూడా అనుమానాస్పంగా కనిపించకపోవడంతో అవన్నీ బోగస్ కాల్స్ అని ఆ తర్వాత అర్థమైపోయింది. కానీ నేరుగా పరిశీలించి నిర్ధారించుకునేంత వరకు ఈ ఫోన్ కాల్స్ ఢిల్లీ పోలీసులును ఉరుకులు పరుగులు పెట్టించాయి. అప్పటివరకు ఆయా ప్రాంతాల్లో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా ట్రాఫిక్ నిలిపేసి మరీ తనిఖీలు చేపట్టారు.
ఇది కూడా చదవండి : Independence Day 2023 Guests: ఈ పంద్రాగస్టుకి స్పెషల్ గెస్టులు ఎవరో తెలుసా ?
ఏయే ప్రాంతాల్లోనైతే ఢిల్లీ పోలీసులు తనిఖీలు నిర్వహించారో.. ఆయా ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని తనిఖీలు నిర్వహించడం చూసి అక్కడి ప్రాంతాల వాసులు సైతం హడలిపోయారు. అసలే స్వాతంత్య్ర దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో పోలీసులు ఇలా ముమ్మరంగా తనిఖీలు చేపట్టి అంతా జల్లెడ పట్టడం చూసిన స్థానికులు, ప్రత్యక్షసాక్షులు.. తమ కళ్ల ముందు ఏం జరుగుతుందో, ఎక్కడ, ఎందుకు తనిఖీలు చేస్తున్నారో అర్థంకాక బిక్కుబిక్కుమంటూ గడిపారు. స్వాతంత్య్ర దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో ఢిల్లీలోని సమస్యాత్మక ప్రాంతాలు, సున్నితమైన ప్రాంతాల్లోనూ ఇటీవల కాలంలో ఇదే పరిస్థితి కనిపించింది. కానీ ఎక్కడా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకపోవడంతో ఢిల్లీ పోలీసులు సహా అందరూ హమ్మయ్య అనే ఊపిరి పీల్చుకున్నారు.
ఇది కూడా చదవండి : Independence Day 2023: జాతీయ జెండా పరిమాణం ఎంత ఉండాలి, జెండా వందనంలో ఫ్లాగ్ కోడ్ ఏం చెబుతోంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి