Delhi Congress releases 3rd list: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు 16 మంది అభ్యర్థులతో కూడిన మూడో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. కాంగ్రెస్ మూడవ జాబితాలో కృష్ణ తీరథ్ పేరు కూడా ఉంది. అతనికి పటేల్ నగర్ నుండి టిక్కెట్ కేటాయించారు. ధరంపాల్ లక్రాను ముండ్కా నుండి అభ్యర్థిగా దించారు. ఒక సీటులో అభ్యర్థిని మార్చారు. గోకల్‌పూర్ స్థానం నుంచి ఈశ్వర్ బగ్రీకి టిక్కెట్ ఇచ్చారు. ఇంతకుముందు ప్రమోద్ కుమార్ జయంత్ పేరు ప్రకటించారు. ఇప్పుడు ఈశ్వర్ బాగ్రీ పోటీ చేయనున్నారు. ఇప్పటి వరకు 70 మంది అభ్యర్థులకు గాను 63 మందిని కాంగ్రెస్ ప్రకటించింది.ఓఖ్లా నుంచి అరిబా ఖాన్, పాలెం నుంచి రామ్, ఆర్కే పురం నుంచి విశేష్ టోకాస్‌లకు పార్టీ టిక్కెట్ ఇచ్చింది. కాగా, గాంధీ నగర్ నుంచి కమల్ అరోరా, మోడల్ టౌన్ నుంచి కున్వర్ కరణ్ సింగ్, షహదారా నుంచి జగత్‌సింగ్ అభ్యర్థులుగా నిలిచారు.
మొత్తం 70 స్థానాలకు గానూ ఇప్పటి వరకు 63 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్. ఫిబ్రవరి 5వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న ఓటింగ్, ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈనెల ప్రారంభంతో రిలీజ్ చేసిన జాబితాలో కల్కాజీ నియోజకవర్గం నుంచి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆల్కాలంబా పోటీ చేస్తారని పార్టీ ప్రకటించింది. అయితే ఈ స్థానంలో ఆప్ నుంచి ప్రస్తుత ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ పోటీచేస్తున్నారు. న్యూ ఢిల్లీలో ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ పోటీ చేస్తున్నారు. కేజ్రీవాల్ పై మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్ ను కాంగ్రెస్ బరిలోకి దించింది.
Also Read: New Scheme: మహిళలకు కోసం కేంద్రం మరో సాయం.. ఈ నగదు బదిలీ పథకం గురించి తెలుసుకోండి
గతంలో కాంగ్రెస్ తన రెండో జాబితాలో 26 మంది పేర్లను ప్రకటించింది. జంగ్‌పురా ఫర్హాద్ సూరికి కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చింది. ఇది ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా స్థానం. దీంతో పాటు సీమాపురి నుంచి రాజేష్ లిలోథియా, ఉత్తమ్ నగర్ నుంచి ముఖేష్ శర్మ, బిజ్వాసన్ నుంచి దేవేంద్ర సెహ్రావత్ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.
తొలిజాబితాలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు 21 మంది అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ ప్రకటించింది. నరేలా నుంచి అరుణ కుమారి, బురారీ నుంచి మంగేష్ త్యాగి, ఆదర్శ్ నగర్ నుంచి శివంక్ సింఘాల్, బద్లీ నుంచి దేవేంద్ర యాదవ్, సుల్తాన్‌పూర్ మజ్రా నుంచి జై కిషన్, నాగ్లోయ్ జాట్ నుంచి రోహిత్ చౌదరి, సలీంఘర్ నుంచి ప్రవీణ్ జైన్‌లకు కాంగ్రెస్ టిక్కెట్లు ఇచ్చింది. కాగా, వజీర్‌పూర్ నుంచి రాగిణి నాయక్, సదర్ బజార్ నుంచి అనిల్ భరద్వాజ్, చాందినీ చౌక్ నుంచి ముదిత్ అగర్వాల్, బల్లిమారన్ నుంచి హరూన్ యూసుఫ్‌కు టిక్కెట్లు ఇచ్చారు.వీరితో పాటు తిలక్ నగర్ నుంచి పీఎస్ బావా, ద్వారక నుంచి ఆదర్శ్ శాస్త్రి, న్యూఢిల్లీ నుంచి సందీప్ దీక్షిత్‌లకు టిక్కెట్లు ఇచ్చారు. కస్తూర్బా నగర్ నుంచి అభిషేక్ దత్, ఛతర్‌పూర్ నుంచి రాజేంద్ర తన్వర్, అంబేద్కర్ నగర్ నుంచి జై ప్రకాశ్, గ్రేటర్ కైలాష్ నుంచి గర్విత్ సింఘ్వీ, పట్‌పర్‌గంజ్ నుంచి అనిల్ కుమార్, సీలంపూర్ నుంచి అబ్దుల్ రెహమాన్, ముస్తఫాబాద్ నుంచి అలీ మెహదీలకు టిక్కెట్లు ఇచ్చారు.
Also Read:Union Budget 2025: వ్యాపారస్థులకు నిర్మలమ్మ గుడ్ న్యూస్? వాటిపై ట్యాక్స్ తగ్గింపు ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter