Nude video case : సోషల్ మీడియాలో మహిళా కార్య‌క‌ర్త నగ్న వీడియో, సీపీఎం (ఎం) పార్టీ సభ్యుడి అరెస్ట్

Kerala CPM activist among a dozen accused of circulating nude video : మహిళకు మ‌త్తుమందు క‌లిపిన కూల్ డ్రింక్ ఇచ్చి... లైంగికంగా వేధించారు. తర్వాత ఆమె న‌గ్న వీడియోల‌ను రికార్డ్‌ చేశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి, సర్క్యులేట్ చేస్తున్నాడనే ఆరోపణతో సీపీఎం (ఎం) పార్టీ సభ్యుడు ఎలిమ‌న్నిల్ స‌జిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 2, 2021, 04:32 PM IST
  • మహిళ కార్య‌క‌ర్త న్యూడ్‌ వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్
  • సీపీఎం (ఎం) పార్టీ సభ్యుడు ఎలిమ‌న్నిల్ స‌జి అరెస్ట్
  • మొత్తం 13 మందిపై కేసు నమోదు
Nude video case : సోషల్ మీడియాలో మహిళా కార్య‌క‌ర్త నగ్న వీడియో, సీపీఎం (ఎం) పార్టీ సభ్యుడి అరెస్ట్

CPM Marxist (M) activist arrested for circulating nude video of lady comrade: ఒక మహిళా కార్య‌క‌ర్త న్యూడ్‌ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి, సర్క్యులేట్ చేస్తున్నాడనే ఆరోపణతో సీపీఎం (ఎం) పార్టీ సభ్యుడు ఎలిమ‌న్నిల్ స‌జి (39)ని (Chumathra Elimannil Saji) పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఈ ఘ‌ట‌న‌లో మొత్తం 13 మందిపై పోలీసులు కేసు ఫైల్ చేశారు. 

కేరళలోని తిరువ‌ల్ల సీపీఎం (ఎం) శాఖ కార్య‌ద‌ర్శి అయిన సీసీ స‌జిమోన్‌తో (CC Sajimon) పాటు డీవైఎఫ్ఐ నేత Democratic Youth Federation of India (DYFI) నాజ‌ర్ (Nasar) ఒక మ‌హిళా కార్యకర్తను మ‌భ్య‌పెట్టి న్యూడ్ వీడియో (nude video) తీశారు. ఈ ఘటన ఈ ఏడాది మేలో జరిగింది. ఆ తర్వాత వీరు ఆ నగ్న వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

ఈ కేసులో ప్రధాన నిందితులైన స‌జిమోన్‌, (Sajimon) నాజ‌ర్‌‌లు (Nasar) ఇద్దరూ బాధితురాలిని కారులో తీసుకువెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఆ మహిళకు మ‌త్తుమందు క‌లిపిన కూల్ డ్రింక్ ఇచ్చి... లైంగికంగా వేధించారు. తర్వాత ఆమె న‌గ్న వీడియోల‌ను రికార్డ్‌ చేశారు. ఆపై బాధితురాలిపై బెదిరింపులకు పాల్పడ్డారు. త‌మ‌కు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే న్యూడ్‌ వీడియోను (Nude‌ video) సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించారు.

Also Read : Omicron meaning: ఒమిక్రాన్ అంటే అర్థం ఏంటి ? New variants కి ఆ పేర్లు ఎలా పెడతారు ?

ఆ మహిళ ఎంత వేడుకున్నా వినలేదు. ఆమె నగ్న వీడియోను సోషల్ మీడియాలో (Social media) పోస్ట్ చేశారు. ఈ కేసులో ఎలిమ‌న్నిల్ స‌జిని పోలీసులు అరెస్ట్‌ చేయగా.. మిగిలిన నిందితులు ప‌రారీలో ఉన్నారు. కేసు (Case) దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులను ప‌ట్టుకునేందుకు పోలీసులు (Police) గాలింపు చర్యలు చేపట్టారు.

Also Read : Akhanda Release Review: 'మాస్ కా బాప్'- 'అఖండ' విజయాన్ని అందుకున్న బాలయ్య.. సెలెబ్రిటీస్ విషెస్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News