''కరోనా వైరస్'' ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ గజగజా వణికిపోతున్నాయి. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా చైనా, ఇటలీల్లో మరణ మృదంగం మోగుతోంది. నిన్న ఒక్కరోజే మృతుల సంఖ్యలో చైనాను దాటిపోయింది ఇటలీ. మరోవైపు కరోనా వైరస్ దెబ్బకు పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
భారత దేశంలోనూ కరోనా వైరస్ క్రమక్రమంగా విస్తరిస్తోంది. భారత్ లో మృతుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ.. రోజు రోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య భయపెడుతోంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 324కు చేరుకుంది. కరోనా వైరస్ ను బ్రేక్ చేసేందుకు ఈరోజు(ఆదివారం ) దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ విధించారు. అటు రాజస్థాన్ ప్రభుత్వం కఠినమైన నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఈ నెల 31వరకు షట్ డౌన్ విధించింది. దీంతో నిత్యావసరాలు తప్ప మిగతా అన్నీ బంద్ చేస్తారు.
Read Also: బాప్ రే బాప్..!!
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు కరోనా నుంచి ఇద్దరు వ్యక్తులు కోలుకున్నారు. గతంలో తెలంగాణలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కరోనా బారిన పడ్డ వారిలో ఇద్దరు సురక్షితంగా బయటపడడం విశేషం. మరోవైపు ఇటలీలో కరోనా వైరస్ మృత్యు ఘంటికలు మోగిస్తోంది. ఈ క్రమంలో అక్కడి నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకువస్తున్నారు. తాజాగా ఎయిర్ ఇండియా విమానంలో 263 మందిని ఢిల్లీకి తీసుకొచ్చారు. రోమ్ నుంచి తీసుకొచ్చిన వారిని ఢిల్లీ నుంచి చావ్లాలోని ఐటీబీపీ క్వారంటైన్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు.అక్కడ వారికి 15 రోజులపాటు చికిత్స అందించిన తర్వాత స్వస్థలాకు పంపించనున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..