India: 25లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌లో కరోనా (Coronavirus) వ్యాప్తి ఏమాత్రం తగ్గడంలేదు. గత కొన్నిరోజుల నుంచి నిత్యం 60 వేలకు పైగానే కరోనా కేసులు నమోదవుతుండగా.. మరణాల సంఖ్య కూడా ప్రతీరోజూ వేయికి దగ్గరగా నమోదవుతోంది. ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య 25లక్షల మార్క్ దాటింది. 

Last Updated : Aug 15, 2020, 10:51 AM IST
India: 25లక్షలు దాటిన కరోనా కేసులు

Covid-19 Positive Cases: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ ( Coronavirus ) వ్యాప్తి ఏమాత్రం తగ్గడంలేదు. గత కొన్నిరోజుల నుంచి నిత్యం 60 వేలకు పైగానే కరోనా కేసులు నమోదవుతుండగా.. మరణాల సంఖ్య కూడా ప్రతీరోజూ వేయికి దగ్గరగా నమోదవుతోంది. ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య 25లక్షల మార్క్ దాటింది. గత 24 గంటల్లో కొత్తగా 65,002 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఈ మహమ్మారి కారణంగా 996మంది మరణించారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (Health Ministry) శనివారం తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 25,26,193కి పెరిగింది. దీంతోపాటు మరణాల సంఖ్య 49,036కి చేరింది.  Also read: Aatmanirbhar Bharat: ఆత్మనిర్భర్ భారత్ ప్రయోజనాలపై ప్రధాని మోదీ కీలక ప్రసంగం

ప్రస్తుతం దేశంలో 6,68,220 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 18,08,937 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే.. శుక్రవారం దేశవ్యాప్తంగా 8,68,679 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ ( ICMR ) తెలిపింది. ఆగస్టు 14 వరకు దేశవ్యాప్తంగా 2,85,63,095 నమూనాలను పరీక్షించినట్లు వెల్లడించింది.   Also read: Lav Agarwal: కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీకి కరోనా

Trending News