Corona Updates in India: దేశంలో కరోనా కేసులు క్రమేపి పెరుగుతున్నాయి. గత రెండు రోజులుగా 18 వేలకు పైగా ఉన్న కోవిడ్ కేసులు..తాజాగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 3.98 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా..20 వేల 409 కొత్త కేసులు వెలుగు చూశాయి. పాజిటివిటీ రేటు 5 శాతంగా ఉంది. మరోవైపు యాక్టివ్ కేసులు సైతం కలవరం పెడుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లక్షా 43 వేల 988 క్రియాశీల కేసులున్నాయి.
తాజాగా రికవరీ రేటు పెరుగుతుండటం ఊరటను ఇస్తోంది. 24 గంటల వ్యవధిలో 22 వేల మంది వైరస్ జయించారు. ఇప్పటివరకు 4.39 కోట్ల కరోనా కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు 4.33 కోట్ల మంది నుంచి కోలుకుని వారియర్‌గా నిలిచారు. రోజువారి కేసులు పెరుగుతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. కరోనా మార్గదర్శకాలను కఠినతరంగా అమలు చేయాలని నిర్ణయించాయి.
ఇప్పటికే మాస్క్‌ను తప్పనిసరి చేశాయి. ఇటు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం బూస్టర్ డోసు పంపిణీ చేస్తున్నారు. ప్రైవేట్ కేంద్రాల్లో వీటిని అందిస్తున్నారు. తాజాగా దాదాపు 39 లక్షల మందికి వ్యాక్సినేషన్ అందించారు. ఇప్పటివరకు 203 కోట్లకు పైగా డోసులు ప్రజలకు పంపిణీ చేశారు.
India reports 20,409 new COVID19 cases today; Active caseload at 1,43,988 pic.twitter.com/3YYULK8bZJ
— ANI (@ANI) July 29, 2022
Also read:Komatireddy: అటు బీజేపీ.. ఇటు కాంగ్రెస్.. మధ్యలో కోమటిరెడ్డి! గంటకో ట్విస్ట్ తో రాజకీయ రచ్చ..!
Also read:Musi River: మూసీ నదికి తగ్గిన వరద ప్రవాహం..ఊపిరి పీల్చుకున్న నగరవాసులు..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook