Complete Lockdown In India: దేశంలో కరోనా వైరస్ ప్రభావం గత ఏడాది కన్నా రెండు రెట్లు అధికంగా కనిపిస్తుంది. కరోనా సెకండ్ వేవ్‌లో దేశంలో 24 గంటల వ్యవధిలో దాదాపు 4 లక్షల పాజిటివ్ కేసులు దాదాపు 3500 మేర కోవిడ్19 మరణాలు సంభవిస్తుండటంతో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు(Supreme Court) స్పందించింది. గత ఏడాది తరహాలోనే పూర్తి స్థాయిలో కరోనా లాక్డౌన్ విధించడంపై ఆలోచించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.
భారత్‌లో కరోనా కేసులు భారీగా పెరిగిపోవడం, మరణాలు సైతం ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ, ఒడిశా, మహారాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించాయి. ఏపీ తెలంగాణ లాంటి కొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి. అయితే కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉండటంతో కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు కచ్చితమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు (Supreme Court) ఆదివారం నాడు సూచించింది. సత్వరమే చర్యలు చేపట్టి కరోనా పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని ఆదేశించింది.
Also Read: COVID-19 Cases: తెలంగాణలో సగానికి తగ్గించిన కరోనా పరీక్షలు, తాజాగా 49 మంది మృతి
ప్రజలు ఒకేచోట భారీ సంఖ్యలో గుడిగూడే ప్రాంతాలపై నిషేధం, ఆంక్షలు విధించాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పరిస్థితి అదుపులోకి రాని పక్షంలో ప్రజల సంక్షేమం కోసం పూర్తి స్థాయిలో లాక్డౌన్(Lockdown In India) సైతం విధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాలని పేర్కొంది. అయితే రోజువారీ పనులపై ఆధారపడి జీవనం సాగించేవారికి తగిన వసతులు ఏర్పాటు చేసిన అనంతరం లాక్డౌన్ లాంటి నిర్ణయాలు ప్రకటించాలని ప్రభుత్వాలకు సలహా ఇచ్చింది.
Also Read: Risk Factors For Covid-19: కరోనా వీరికి సోకితే మరింత ప్రమాదకరం.. ప్రాణాలు కూడా పోతాయి
భారత్‌లో ఆదివారం 3.92 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో దేశ వ్యాప్తంగా ఇప్పటివరకూ నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1.95 కోట్లకు చేరింది. అందులో 33 లక్షల 49 వేల 6 వందల 44 యాక్టివ్ కేసులున్నాయి. వీరు ఆసుపత్రులలో, ఇళ్లల్లో హోం ఐసోలేషన్‌లో వైద్యుల సలహాతో చికిత్స పొందుతున్నారు. ఆదివారం నాటికి 1,59,92,271 మంది కరోనా మహమ్మారిని జయించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook