కర్ణాటక ఉప ఎన్నికలు: పొత్తులపై స్పందించిన కాంగ్రెస్

కర్ణాటక ఉప ఎన్నికలు: పొత్తుపై స్పందించిన సిద్ధరామయ్య

Last Updated : Sep 30, 2019, 11:25 AM IST
కర్ణాటక ఉప ఎన్నికలు: పొత్తులపై స్పందించిన కాంగ్రెస్

బెంగళూరు: కర్ణాటకలో 15 స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో పొత్తులపై కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇచ్చింది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సిద్ధరామయ్య కలబుర్గిలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ... 15 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టంచేశారు. 2018 ఎన్నికల తర్వాత జేడీఎస్‌తో కలసి పోటీ చేసినప్పటికీ.. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసేది లేదని జేడీఎస్ అధినేత, దేవేగౌడ, కుమారస్వామి ప్రకటించారని సిద్ధరామయ్య గుర్తుచేశారు. అంతేకాకుండా తాము ఒంటరిగానే పోటీ చేసి ఎక్కువ స్థానాలు గెలుపొందుతామనే ధీమా వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కర్ణాటకలోని బీజేపి సర్కార్‌పై విమర్శలు ఎక్కుపెట్టిన సిద్ధరామయ్య.. ఉప ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో బీజేపీ సర్కార్‌ అడ్రస్ గల్లంతు కానుందని వ్యాఖ్యానించారు.

Trending News