సీతాదేవి ఓ టెస్ట్ ట్యూబ్ బేబీ.. నారదుడు ఓ గూగుల్ సెర్చ్ ఇంజెన్: బీజేపీ నేత ఆసక్తికర వ్యాఖ్యలు

టెస్ట్ ట్యూబ్ ద్వారా పిల్లలను కనే ప్రక్రియ రామాయణకాలంలోనే ఉందని.. అందుకు సీతాదేవి ఉదాహరణ అనే ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత దినేష్ శర్మ అభిప్రాయపడ్డారు. గురువారం ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Last Updated : Jun 1, 2018, 04:41 PM IST
సీతాదేవి ఓ టెస్ట్ ట్యూబ్ బేబీ.. నారదుడు ఓ గూగుల్ సెర్చ్ ఇంజెన్: బీజేపీ నేత ఆసక్తికర వ్యాఖ్యలు

టెస్ట్ ట్యూబ్ ద్వారా పిల్లలను కనే ప్రక్రియ రామాయణకాలంలోనే ఉందని.. అందుకు మట్టికుండ నుండి ఉద్భవించిన సీతాదేవిని ఉదాహరణగా చెప్పుకోవచ్చని ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత దినేష్ శర్మ అభిప్రాయపడ్డారు. గురువారం ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "హిందీ జర్నలిజం డే" వేడుకలకు హాజరైన ఆయన ఈ సందర్భంగా తన ఆలోచనలను పంచుకున్నారు. జర్నలిజం అనేది మహాభారతంలో కూడా ఉందని.. నారదుడిని ఓ గూగుల్ సెర్చ్ ఇంజిన్‌తో పోల్చవచ్చని అని ఆయన తెలిపారు.

కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు సంజయుడు స్వయంగా కళ్లు లేని ధృతరాష్ట్రుడికి యుద్ధ సన్నివేశాలు పూసగుచ్చినట్టు వర్ణించాడని.. ఆ అంశాన్ని లైవ్ టెలికాస్ట్‌తో పోల్చవచ్చని ఆయన అన్నారు. అలాగే నారద మహర్షిని నేడు గూగుల్ సెర్చింజిన్‌తో పోల్చవచ్చని ఆయన అన్నారు. ఈ మధ్యకాలంలో సైన్సును పురాణాలతో లింక్ పెట్టడం బీజేపీ నేతలకు సాధారణమైన అంశం కావడం గమనార్హం. ఇటీవలే త్రిపుర సీఎం బిప్లవ్ దేవ్ ఇంటర్నెట్, శాటిలైట్లు వెయ్యి సంవత్సరాల క్రితమే భారతదేశంలో ఉపయోగించారని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 

Trending News