PM Modi: 'మిమ్మల్ని మీరు మార్చుకోకపోతే..నేనే మార్చేస్తా'..భాజపా ఎంపీలకు మోదీ వార్నింగ్..!

PM Modi: పార్లమెంట్‌ సమావేశాలకు గెర్హాజరు విషయంపై భాజపా ఎంపీలకు  ప్రధాని మోదీ హెచ్చరికలు జారీ చేశారు. ఎంపీలు తమకు తాముగా మారకపోతే.. తామే మార్పులు చేస్తామని మోదీ అన్నారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 7, 2021, 02:04 PM IST
PM Modi: 'మిమ్మల్ని మీరు మార్చుకోకపోతే..నేనే మార్చేస్తా'..భాజపా ఎంపీలకు మోదీ వార్నింగ్..!

PM Modi: భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశం(BJP parliamentary party meeting) మంగళవారం దిల్లీలోని అంబేడ్కర్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఎంపీల తీరుపై అగ్రహం వ్యక్తం చేశారు. తరచుగా సమావేశాలకు చాలామంది ఎంపీలు(BJP MPs) గైర్హాజరు కావడంపై ప్రధాని మోదీ(PM Modi) అసహనం వ్యక్తం చేశారు. ఎంపీలు ఇకనైనా తమ ప్రవర్తన మార్చుకోవాలని, లేదంటే మార్పులు తప్పవని మోదీ హెచ్చరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 

ఎంపీలందరూ పార్లమెంట్‌ సమావేశాల(Parliament Sessions)కు క్రమం తప్పకుండా హాజరుకావాలని...చిన్నపిల్లల ప్రతిసారి చెప్పించుకోవడం బాలేదని మోదీ మండిపడ్డారు. 'ఇకనైనా మారండి. ఒకవేళ మిమ్మల్ని మీరు మార్చుకోకపోతే.. సమయానుగుణ మార్పులు జరుగుతాయి'’ అని భాజపా ఎంపీలకు మోదీ వార్నింగ్‌ ఇచ్చారు. ఎంపీల గైర్హాజరుపై మోదీ గతంలోనూ పలుమార్లు ఫైర్ అయ్యారు. పార్టీ ఎంపీలు క్రమశిక్షణ పాటించాలని, అనుచిత వ్యాఖ్యలు చేయకూడదని ఇదీవరకే మోదీ చాలాసార్లు చెప్పారు. 

Also Read: Hero Siddharth: జవాబుదారీతనం ఎక్కడుంది? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై హీరో సిద్ధార్థ్ మండిపాటు..

ఈ కార్యక్రమానికి హోంమంత్రి అమిత్ షా, వాణిజ్య మంత్రి పీయూష్  గోయల్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి సహా సీనియర్ మంత్రులు,  భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా హాజరయ్యారు. ఎంపీలు తమ తమ నియోజకవర్గాల్లో క్రీడా పోటీలు నిర్వహించాలని ప్రధాని సూచించినట్లు  మంత్రి ప్రహ్లాద్‌ జోషీ(Prahlad Joshi) వెల్లడించారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News