Bharat Rice: మార్కెట్‌లోకి భారత్ బ్రాండ్ బియ్యం.. కేజీ రూ.25కే..!

Bharat Brand Rice Price: మన దేశంలో బహిరంగ మార్కెట్‌లో భారత్ రైస్ అందుబాటులోకి రానున్నాయి. 25 రూపాయలకే కేజీ విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గోధుమ పిండి, పప్పులను తక్కువ ధరకే విక్రయిస్తుండగా.. భియ్యం కూడా సబ్సిడీ ధరలో అందుబాటులోకి తీసుకురానుంది.   

Written by - Ashok Krindinti | Last Updated : Dec 27, 2023, 06:28 PM IST
Bharat Rice: మార్కెట్‌లోకి భారత్ బ్రాండ్ బియ్యం.. కేజీ రూ.25కే..!

Bharat Brand Rice Price: దేశ ప్రజలకు త్వరలోనే గుడ్‌న్యూస్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. బియ్యంపై రెండెంకెల ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. భారత్ బ్రాండ్ పేరుతో కిలో బియ్యం 25 రూపాయలకే డిస్కౌంట్ ధరతో విక్రయించే అవకాశం ఉన్నట్లు ఓ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే పప్పు, గోధుమ పిండి డిస్కౌంట్‌లో విక్రయిస్తుండగా.. ఇక నుంచి బియ్యం కూడా విక్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. భారత్ రైస్ త్వరలోనే మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ బియ్యం నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (Nafed), నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ (NCCF) కేంద్రీయ భండార్ ద్వారా నిర్వహిస్తున్న అవుట్‌లెట్ల ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉండనుంది.

ప్రభుత్వం ఇప్పటికే గోధుమ పిండి, పప్పులను భారత్ బ్రాండ్‌తో మార్కెటింగ్‌ చేస్తోంది. నవంబర్‌లో తృణధాన్యాల ధరలు 10.27 శాతానికి పెరిగాయి. ఆహార ద్రవ్యోల్బణం గత నెల 6.61 శాతం నుంచి 8.70 శాతానికి పెరిగింది. దీంతో వినియోగదారులకు ఖర్చులు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలోనే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) ఈ-వేలం ద్వారా బహిరంగ మార్కెట్‌లో బియ్యాన్ని తక్కువ ధరకు అందించేందుకు ప్లాన్ చేస్తోంది. బియ్యం అమ్మకాలను పెంచడానికి ఎఫ్‌సీఐ ఇటీవల ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ (OMSS) నిబంధనలను సవరించింది. బిడ్డింగ్ పరిమితులను సడలించింది. 

ప్రస్తుతం 'భారత్ అట్టా' పేరుతో సబ్సిడీ గోధుమ పిండిని  కిలో రూ.27.50, 'భారత్ దాల్' పేరుతో కిలో పప్పు ప్యాక్‌లను రూ.60 చొప్పున విక్రయిస్తోంది. వినియోగదారులకు అందుబాటులో ఉండేలా పప్పుధాన్యాలను సబ్సిడీ ధరలకు అందించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలో పెరుగుతున్న బియ్యం ధరలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టిన కేంద్రం..

బాస్మతియేతర రకాల ఎగుమతులపై నిషేధం విధించింది. బాస్మతి బియ్యంపై కూడా ఆంక్షలు అమలు చేస్తోంది. తాజాగా కిలో బియ్యం రూ.25కే అందుబాటులోకి తీసుకువచ్చేందుకు యోచిస్తోంది. ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 

Also Read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

Also Read: Corona Jn.1 Precautions: దేశంలో కరోనా కొత్త వేరియంట్ భయం, లక్షణాలెలా ఉంటాయి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News