International Flights: కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా అన్ని నిబంధనల్ని సడలిస్తోంది. తాజాగా కరోనా గైడ్‌లైన్స్‌ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం..మరో నిర్ణయం తీసుకుంది.
దేశంలో కరోనా పరిస్థితులు సాధారణమౌతున్నాయి. చైనా, దక్షిణ కొరియా మినహా మిగిలిన దేశాల్లో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో దేశంలో కరోనా నిబంధనల్ని తొలగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మరోవైపు అంతర్జాతీయ విమాన రాకపోకలకు సంబంధించిన కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి అంటే మార్చ్ 26 నుంచి అంతర్జాతీయ విమాన రాకపోకలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గెగ్యులర్ ఇంటర్నైషనల్ ఫ్లైట్స్ కొనసాగించవచ్చని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ పెరగడం, కరోనా కేసులు తగ్గడంతో అంతర్జాతీయ విమాన రాకపోకలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టుగా కేంద్రం తెలిపింది.
అంతర్జాతీయ ప్రయాణాలకు అనుమతించినా..కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ మార్గదర్శకాల్ని తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రపంచవ్యాప్తంగా పెరగడంతో వివిధ దేశాలతో చర్చించిన తరువాతే..అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని తొలగించాలని నిర్ణయించినట్టు పౌర విమానయాన శాఖ వెల్లడించింది. ఇవాళ్టి నుంచి ఇండియా నుంచి అన్ని షెడ్యూల్ కమర్షియల్ ప్యాసెంజర్ ఫ్లైట్స్ కొనసాగనున్నాయి.
Also read: Yogi Adityanath: రెండోసారి యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook