Heavy Rains: వాయుగుండం.. 3 రోజులు భారీ వర్షాలు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండి హెచ్చరిక..

Heavy Rains In Ap: తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగిపోతుంది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండి తీవ్ర హెచ్చరికలు చేసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

1 /5

గత కొన్ని రోజులుగా బంగాళాఖాతంలో అల్పపీడనలు ఏర్పడుతున్నాయి ఈ సందర్భంగా ఈ కారణంగా తెలుగు రాష్ట్రాల పాటు తమిళనాడు, ఒరిస్సా వంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసాయి.  

2 /5

అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం రేపు వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 27, 28, 29 తేదీలు మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయి.  

3 /5

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక మిగిలిన ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయి. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని వాతావరణ శాఖ హెచ్చరించింది.  

4 /5

 ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల వాయుగుండంగా మారనుంది. ఇది ముఖ్యంగా ఏపీలోని ప్రాంతాల ప్రభావితం చూపిస్తుందో తెలంగాణలో కూడా మోస్తారు వర్షాలు కురుస్తాయని ఐఎండి హెచ్చరించింది.  

5 /5

తెలుగు రాష్ట్రాల్లో చల్లి తీవ్రత కూడా పెరిగిపోతుంది రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి పగలు సాధారణంగా నమోదు అవుతున్నాయి. వృద్ధులు, పిల్లలు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ చెప్పింది. లేకపోతే సీజనల్ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.