Vehicular Documents: డ్రైవింగ్ లైసెన్స్​, వాహన పత్రాల గడువు పెంపు

కరోనావైరస్ మహమ్మరి వ్యాప్తి దృష్ట్యా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వాహనదారుల డ్రైవింగ్ లైసెన్సులు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, వాహనాల పర్మిట్ల వంటి ద్రువపత్రాల గడువును మరోసారి పొడిగిస్తూ సర్క్యూలర్ జారీ చేసింది.

Last Updated : Dec 27, 2020, 07:00 PM IST
Vehicular Documents: డ్రైవింగ్ లైసెన్స్​, వాహన పత్రాల గడువు పెంపు

Centre extends validity of vehicular documents: కరోనావైరస్ మహమ్మరి వ్యాప్తి దృష్ట్యా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వాహనదారుల డ్రైవింగ్ లైసెన్సులు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, వాహనాల పర్మిట్ల (Vehicular documents) వంటి ద్రువపత్రాల గడువును మరోసారి పొడిగిస్తూ సర్క్యూలర్ జారీ చేసింది. డిసెంబరు 31తో అంతకుముందు విధించిన గడువు పూర్తవుతున్న నేపథ్యంలో 2021 మార్చి 31వ తేదీ వరకు పొడిగిస్తూ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ డైరెక్టరీని విడుదల చేసింది. 

అయితే ఈ ఏడాది ఫిబ్ర‌వరి 1తో గ‌డువు ముగిసిన వాహన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ (Driving Licence) తదితర పత్రాల గ‌డువును వ‌చ్చే ఏడాది మార్చి 31 వ‌రకు చెల్లుబాటు అవుతాయని కేంద్రం పేర్కొంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ఈ నిర్ణ‌యం తీసుకొని అన్ని రాష్ట్రాల ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు కేంద్రం (Central government) ఆదేశాలను జారీ చేసింది. Also Read: Rajinikanth: ఆసుపత్రి నుంచి రజనీకాంత్ డిశ్చార్జ్‌

అంతకుముందు కేంద్ర ప్రభుత్వం మోటారు వాహనాల చట్టం ప్రకారం కరోనా (Coronavirus) కారణంగా.. మార్చి 30, జూన్ 9, ఆగస్టు 24 తేదీలల్లో గడువును సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో విధించిన గడువు డిసెంబ‌ర్ 31తో ముగుస్తున్న నేపథ్యంలో.. వాహన పత్రాల పున‌రుద్ధ‌రణకు వాహనదారులు ర‌వాణా శాఖ కార్యాల‌యాలకు పెద్ద ఎత్తున వస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం (Ministry of Road Transport & Highways) మరోసారి గడువును పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. Also Read: Covid-19: ఇదే చివరి మహమ్మారి కాదు: WHO

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News