Covid-19: ఆసుపత్రి నుంచి అమితాబ్ డిశ్చార్జ్

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కరోనావైరస్ ( Coronavirus ) బారిన పడి గత మూడు వారాలుగా ముంబైలోని నానావతి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. 

Last Updated : Aug 2, 2020, 06:34 PM IST
Covid-19: ఆసుపత్రి నుంచి అమితాబ్ డిశ్చార్జ్

Amitabh Bachchan discharge: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కరోనావైరస్ ( Coronavirus ) బారిన పడి గత మూడు వారాలుగా ముంబైలోని నానావతి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే.. అమితాబ్‌ ( Amitabh Bachchan ) తోపాటు తనయుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్య రాయ్, మనవరాలు ఆరాధ్యకు కూడా కరోనా సోకింది. అయితే ఐశ్వర్య, ఆరాధ్య కరోనా నుంచి కోలుకోని డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికీ తండ్రికొడుకులు అమితాబ్, అభిషేక్ ఇద్దరూ హాస్పిటల్‌లోనే ఉన్నారు. ఈ క్రమంలో అమితాబ్ హాస్పటల్ నుంచే భాదతో కూడుకున్న పలు సందేశాలను అభిమానులతో పంచుకుంటూ వచ్చారు. ఈ మేరకు అభిషేక్ బచ్చన్ ( Abhishek Bachchan ) ట్విట్ చేసి ఫ్యాన్స్‌తో సంతోషకరమైన వార్తను పంచుకున్నాడు. Also read: ఆసుపత్రి నుంచి సోనియా గాంధీ డిశ్ఛార్జ్

తాజాగా చేసిన కరోనా టెస్టులో అమితాబ్ బచ్చన్‌కు నెగిటివ్ వచ్చిందని.. ఆయన్ని డిశ్చార్జ్ చేశారని వెల్లడించాడు. ఇకపై ఆయన ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకుంటారని, అమితాబ్ ఆరోగ్యం కోసం ప్రార్థించిన వాళ్లకు కృతజ్ఞతలు అంటూ ట్విట్ చేశాడు. ఇదిలాఉంటే.. కరోనా బారిన చికిత్స పొందుతున్న అభిషేక్ బచ్చన్.. మాత్రం తన ఆరోగ్యం విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. మొత్తానికి అమితాబ్ కరోనా మహమ్మారి నుంచి కోలుకుని ఇంటికి చేరుకోన్నారన్న వార్త తెలియడంతోనే అభిమానులు ఆనందంలో మునిగిపోతున్నారు.  UP: కరోనాతో మంత్రి కమల్‌రాణి మృతి

Trending News