సముద్రంలో 40 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్న బోటు బోల్తా

Last Updated : Jan 13, 2018, 02:25 PM IST
సముద్రంలో 40 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్న బోటు బోల్తా

మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. దహనుకి సమీపంలో వున్న సముద్ర తీరానికి 2 నాటికల్ మైళ్ల దూరంలో శుక్రవారం ఉదయం 40 మంది స్కూల్ విద్యార్థులతో సముద్రంలోకి వెళ్లిన బోటు బోల్తా పడింది. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్లడించిన సమాచారం ప్రకారం ఈ దుర్ఘటనలో నలుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా 32 మందిని బోటు సిబ్బంది రక్షించారు. గల్లంతైన మరో నలుగురు విద్యార్థుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ నర్నవరే తెలిపారు. జిల్లా ఎస్పీ, స్థానిక ప్రభుత్వ యంత్రాంగం ఈ సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నట్టు కలెక్టర్ చెప్పారు.

 

ప్రాథమిక సమాచారం ప్రకారం ఓవర్ లోడ్ కారణంగానే బోటు సముద్రంలో బోల్తాపడినట్టు తెలుస్తోంది. సహాయకచర్యలకి ఆటంకం కలగకుండా సముద్ర తీరంలోని పడవలని కోస్ట్ గార్డులు మరో వైపుకి మళ్లించారు. డార్నియర్ ఎయిర్ క్రాఫ్ట్ సహా హెలీక్యాప్టర్ల ద్వారా సహాయక చర్యలు చేపడుతున్నారు. మరిన్ని వివరాలు అందాల్సి వుంది.

Trending News