Narendra Modi Birthday: ‘సేవా సప్తాహ్’‌గా మోదీ జన్మదిన వేడుకలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ( Narendra Modi ) జన్మదినం సెప్టెంబరు 17న జరగనుంది. ఈ ఏడాది ప్రధాని 70వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు. అయితే.. మోదీ జన్మదినం ( Narendra Modi Birthday) సందర్భంగా బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది.

Last Updated : Aug 30, 2020, 04:06 PM IST
Narendra Modi Birthday: ‘సేవా సప్తాహ్’‌గా మోదీ జన్మదిన వేడుకలు

Modi 70th Birthday as Seva Saptah: న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ( Narendra Modi ) జన్మదినం సెప్టెంబరు 17న జరగనుంది. ఈ ఏడాది ప్రధాని 70వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు. అయితే.. మోదీ జన్మదినం ( Narendra Modi Birthday) సందర్భంగా బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెలలో ‘సేవా సప్తాహ్’ పేరుతో సేవా వారోత్సవాలు నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ (BJP) నిర్ణయించింది. ఈ మేరకు సెప్టెంబరు 14 నుంచి 20 వరకు సేవా కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది. మోదీ 70వ పుట్టినరోజు సందర్భంగా.. 70 ఇతివృత్తంతో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలో తెలియజేస్తూ.. బీజేపీ అధిష్టానం రాష్ట్ర శాఖలకు ఓ సర్క్యూలర్‌ను సైతం పంపించింది. Also read: Most Desirable Women: అగ్రస్థానంలో నిలిచిన దిశా పటాని

కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి కారణంగా వేడుకలు లేదా సామూహిక సమావేశాలను నివారించడానికి బీజేపీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. మోదీ జన్మదినం సందర్భంగా కోవిడ్ నిబంధనలు పాటించాలని స్పష్టంగా సూచించింది. ఈ మేరకు మాస్కులు, శానిటైజర్లు, మందులను పంపిణీ చేయాలని, రక్తదాన శిబిరాలను, వైద్యశిబిరాలను నిర్వహించాలని, పండ్లు పంపిణీ చేయాలని, ప్లాస్మా దానానికి కరోనా బాధితులను ప్రోత్సహించాలని, దివ్యాంగులకు పరికరాలు అందించాలని కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం చేస్తూ.. బీజేపీ సర్క్యూలర్ పంపించింది.    Apsara Rani: స్విమ్ డ్రెస్‌లో రెచ్చిపోయిన అప్సర    Also read: Seerat Kapoor: పిచ్చెక్కిస్తున్న సీరత్ కపూర్ సోయగాలు

Trending News