Bihar School Teachers Shocking leave letters shakes internet. బిహార్‌లో కొందరు టీచర్స్ రాసిన లీవ్ లెటర్‌లు ప్రస్తుతం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. స్కూల్ బంక్ కొట్టేందుకు విద్యార్థులు రకరకాల కారణాలు చెబుతారన్న విషయం తెలిసిందే. కడుపు నొస్తుందని, తల నొస్తుందని, జ్వరం వచ్చిందని రకరకాల కారణాలు చెబుతుంటారు. ఇందులో పెద్దగా ఆశ్చర్యమేమీ లేదు. కానీ స్కూల్ బంక్ కొట్టేందుకు టీచర్స్ రీజన్స్ చెప్పడం ఎప్పుడైనా విన్నారా?. మీరు చదువుతుంది నిజమే.. బిహార్‌లో కొందరు టీచర్స్ రాసిన లీవ్ లెటర్‌లు ప్రస్తుతం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే...
బిహార్ బాంకా జిల్లాలోని కచారి పిప్రా గ్రామానికి చెందిన అజయ్ కుమార్ అనే టీచర్ స్కూల్ ప్రిన్సిపల్‌కు తాజాగా లీవ్ లెటర్ రాశారు. 'మా అమ్మ ఈ నెల 5వ తేదీ (డిసెంబర్ 6) రాత్రి 8 గంటలకు చనిపోతారు. అమ్మ అంత్యక్రియల కోసం 6, 7 తేదీల్లో సెలవు కావాలి. దయచేసి సెలవు ఇవ్వండి' అని లీవ్ లెటర్లో పేర్కొన్నారు. ఇది చూసిన స్కూల్ ప్రిన్సిపల్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇందుకు సంబందించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘నేను పెళ్లికి వెళ్లాలి. అక్కడ బాగా భోజనం చేస్తాను. కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది. డిసెంబర్ 7న లీవ్ మంజూరు చేయండి’ అని కటోరియాకు చెందిన నీరజ్ కుమార్ అనే టీచర్.. స్కూల్ ప్రిన్సిపల్‌ను కోరారు. బరాహత్‌లోని ఖాదియారా ఉర్దూ విద్యాలయ టీచర్ రాజ్‌గౌరవ్.. త్వరలో తనకు ఆరోగ్యం పాడవ్వనుందని ఓ లేఖ రాశారు. డిసెంబర్ 4, 5 తేదీల్లో తనకు సెలవు ఇవ్వండని కోరారు. ఇందుకు సంబందించిన లీవ్ లెటర్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
టీచర్స్ నుంచి ఇలాంటి వింత లీవ్ లెటర్‌లు రావడానికి ప్రభుత్వ ఉత్తర్వులే కారణమని అందరూ చెబుతున్నారు. ఉపాధ్యాయులు 3 రోజుల ముందుగానే క్యాజువల్ లీవ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ముంగేర్, భాగల్పూర్, బంకా జిల్లాల్లో విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 3 రోజుల ముందుగా క్యాజువల్ లీవ్ దరఖాస్తు చేయని పక్షంలో వారి సెలవులు స్వీకరించబడవని పేర్కొంది. అందుకే టీచర్లు కావాలనే ఇలాంటి వింత లీవ్ లెటర్‌లు రాస్తున్నారట.
Also Read: HCU Rape: సెంట్రల్ యూనివర్సిటీలో దారుణం.. థాయిలాండ్ విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారాయత్నం!
Also Read: Gold Coins: పైపులైన్ కోసం తవ్వుతుండగా.. బయటపడ్డ బంగారు నాణేలు! షాక్‌లో యజమానులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.