Loudspeakers Issue: దేశవ్యాప్తంగా మతపరమైన ప్రాంతాల్లో లౌడ్ స్పీకర్ల వినియోగంపై వివాదం రేగుతోంది. యూపీలో యోగీ తీసుకున్న నిర్ణయంపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సైతం...ఏమన్నారంటే
ఉన్నది ఉన్నట్టు మాట్లాడే నేతగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు పేరుంది. ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేసే వ్యక్తి. అందుకే నితీష్ కుమార్‌కు అక్కడి పట్టం కడుతుంటారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా వివాదంగా మారుతున్న లౌడ్ స్పీకర్ల వ్యవహారంపై స్పందించారు. దేశంలోని మతపరమైన ప్రాంతాల్లో లౌడ్ స్పీకర్లు తొలగించాలనే వివాదమిది. యూపిలో అక్కడి ముఖ్యమంత్రి యోగీ మతపరమైన ప్రాంతాల్నించి లౌడ్ స్పీకర్లను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అదే నిర్ణయాన్ని బీహార్ ప్రభుత్వం కూడా తీసుకోవాలనేది అక్కడి బీజేపీ నేతల డిమాండ్. బీహార్‌లో బీజేపీ కూడా ప్రభుత్వంలో భాగస్వామి కావడం విశేషం.
అయితే దీనిపై నిర్మొహమాటంగా మండిపడ్డారు నితీష్ కుమార్. నాన్సెన్స్ అంటూ వ్యాఖ్యానించారు. లౌడ్ స్పీకర్ల తొలగింపు ఓ పనికిమాలిన చర్య అని అసమ్మతి వ్యక్తం చేశారు. మతపరమైన విషయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు. బీజేపీ నేతలకు నితీష్ కుమార్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. మతపరమైన ప్రాంతాల్లో లౌడ్ స్పీకర్లు తొలగించడం వల్ల ప్రయోజనం లేదని..తాను అంగీకరించనన్నారు. ఎవరిపేరు ప్రస్తావించకుండానే పరోక్షంగా బీజేపీకు కౌంటర్ ఇచ్చారు.
హిందూస్తానీ అవామ్ మోర్చా నేత జితన్ రామ్ మాంఝీ నివాసంలో ఏర్పాటైన ఇఫ్తార్ విందులో పాల్గొన్న నితీష్ కుమార్ ఈ విషయంపై మాట్లాడారు. కొంతమంది వివాదాల్ని సృష్టించడమే పనిగా పెట్టుకుంటారని పరోక్షంగా సెటైర్లు విసిరారు. మాజీ మంత్రి జితన్ రామ్ మాంఝీ, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ కూడా లౌడ్ స్పీకర్ వివాదం అర్ధరహితమన్నారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధానాలన్నారు.
Also read: Prashanth Kishore: బీజేపీని ఓడించే చిట్కా చెప్పిన పీకే.. కేసీఆర్ ఏమంటారో?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.