Bhupendra patel: గుజరాత్‌ కొత్త సీఎంగా భూపేంద్ర పటేల్‌

Bhupendra Patel: గుజరాత్‌ కొత్త ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్‌ ఎన్నికయ్యారు. ఈ మేరకు బీజేపీ శాసనసభాపక్షం ఏకగ్రీవంగా పటేల్‌ను ఎన్నుకుంది. భూపేంద్ర పటేల్‌ ఘట్లోడియా నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 12, 2021, 05:01 PM IST
  • గుజరాత్‌ కొత్త సీఎంగా భూపేంద్ర పటేల్‌
  • ఘట్లోడియా నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న భూపేంద్ర పటేల్‌
  • సీఎం పదవికి రాజీనామా చేసిన విజయ్ రూపానీ
Bhupendra patel: గుజరాత్‌ కొత్త సీఎంగా భూపేంద్ర పటేల్‌

Bhupendra Patel:గుజరాత్‌ నూతన సీఎంగా భూపేంద్ర పటేల్‌ ఎంపికయ్యారు. ఇవాళ సమావేశమైన భాజపా శాసనసభా పక్షం ఈ మేరకు భూపేంద్ర పటేల్‌(Bhupendra Patel)ను గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఈ సమావేశానికి కేంద్ర పరిశీలకులుగా విచ్చేసిన తోమర్‌, ప్రహ్లాద్‌ జోషి సమక్షంలో సీఎం ఎంపిక జరిగింది. గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని భూపేంద్ర పటేల్‌ కోరనున్నారు. ప్రస్తుతం ఆయన ఘట్లోడియా(Ghatlodia) నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా  ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

విజయ్‌ రూపానీ(Vijay Rupani) శనివారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వచ్చే శాసనసభ ఎన్నికల్లో భాజపాను విజయతీరాలకు చేర్చడమే లక్ష్యంగా పార్టీ అధిష్ఠానం ముఖ్యమంత్రి మార్పు చేపట్టింది. సీఎం పీఠాన్ని పటేల్‌ సామాజిక వర్గానికి ఇవ్వాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించడంతో అనూహ్యంగా భూపేంద్ర పటేల్‌ పేరు తెరపైకి వచ్చింది. 

Also Read: Vijay Roopani Resigned: గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ రాజీనామా

గుజరాత్‌ మాజీ సీఎం, యూపీ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌(Anandiben Patel)కు సన్నిహితుడిగా భూపేంద్ర పటేల్‌కు పేరుంది. గతంలో ఆమె పోటీ చేసిన ఘట్లోడియా నుంచే 2017లో పోటీ చేసిన ఆయన.. లక్షకు పైగా ఓట్లతో విజయం సాధించారు. గతంలో అహ్మదాబాద్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(Ahmedabad Urban Development Authority)కి ఛైర్మన్‌గానూ వ్యవహరించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News