Dilip Ghosh: పద్దతి మార్చుకోకుంటే శ్మశానానికే: బెంగాల్ బీజేపీ చీఫ్ వార్నింగ్

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు (West Bengal Assembly elections) వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్నాయి. ఈ క్రమంలో బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు చీఫ్ దిలీప్ ఘోష్ (BJP Bengal president Dilip Ghosh) మమతా మద్దతు దారులను (TMC cadres) హెచ్చరిస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

Last Updated : Nov 9, 2020, 11:05 AM IST
Dilip Ghosh: పద్దతి మార్చుకోకుంటే శ్మశానానికే: బెంగాల్ బీజేపీ చీఫ్ వార్నింగ్

Bengal BJP chief Dilip Ghosh warning to TMC cadres: హల్దియా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు (West Bengal Assembly elections) వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాగైనా మళ్లీ అధికారాన్ని దక్కించుకోవాలని టీఎంసీ (TMC).. బెంగాల్‌లో కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ (BJP) ఇప్పటికే కసరత్తులు ప్రారంభించాయి. ఈ క్రమంలో బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు చీఫ్ దిలీప్ ఘోష్ (BJP Bengal president Dilip Ghosh) మమతా మద్దతు దారులను (TMC cadres) హెచ్చరిస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా టీఎంసీ కార్యకర్తలు తమ పద్ధతిని మార్చుకోకుంటే ముందు ఆసుపత్రికి వెళతారని.. అప్పటికీ వినకపోతే.. ఇంక వారు శ్మశానానికే వెళతారంటూ తీవ్రంగా హెచ్చరించారు. 

ఆదివారం దిలీప్ ఘోష్ రాష్ట్రంలోని తూర్పు మిడ్నాపూర్ జిల్లా హల్దియా పట్టణంలో జరిగిన బీజేపీ ర్యాలీలో ప్రసంగించారు. వచ్చే ఏడాది మే లేదా ఏప్రిల్‌లో కేంద్ర బలగాల సమక్షంలో ఎన్నికలు జరుగుతాయని దిలీప్ ఘోష్ తెలిపారు. అయితే ప్రజలను హింసించే టీఎంసీ కార్యకర్తలు ఇప్పటికైనా తమ పద్దతిని మార్చుకోవాలని.. లేకపోతే ముందు వారి చేతులు, కాళ్లు, పక్కటెముకలు విరిగిపోయి వారు ఆసుపత్రి పాలవుతారన్నారు.. అప్పటికీ వారు వినకుండా ఉంటే నేరుగా శ్మశానానికే వెళ్లాల్సి ఉంటుందని దిలీప్ ఘోష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. Also read: Telangana: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

కేంద్ర ప్రభుత్వం ప్రజల వెన్నంటే ఉందని ఘోష్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి భయ వాతావరణం తలెత్తకుండా చూసుకుంటుందని ప్రజలకు ఆయన హామీనిచ్చారు. మమత సర్కారుకు రోజులు దగ్గరపడ్డాయని, బెంగాల్‌ను ప్రజాస్వామ్య రాజ్యంగా నెలకోల్పుతామని దిలీప్ ఘోష్ పేర్కొన్నారు. ఇదిలాఉంటే.. దిలీప్ ఘోష్ రాజకీయ వాతావరణాన్ని దెబ్బతీస్తున్నారని టీఎంసీ ఆగ్రహం వ్యక్తంచేసింది. Also read: Narendra Modi: షిప్పింగ్ మంత్రిత్వ శాఖ పేరు మార్పు: ప్రధాని మోదీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News