Bank Holidays in Telugu: బ్యాంకులకు ప్రతి నెలా సెలవులు మారుతుంటాయి. ఈ సెలవులు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటాయి. కొన్ని ప్రాంతీయ సెలవులయితే మరి కొన్ని జాతీయ సెలవులుంటుంటాయి. అందుకే ఆర్బీఐ ప్రతి నెలా హాలిడేస్ లిస్ట్ జారీ చేస్తుంటుంది. వచ్చే నెల అంటే 2025 జనవరిలో బ్యాంకులకు ఏకంగా 14 రోజులు సెలవులున్నాయి.
ఇటీవలి కాలంలో బ్యాంకింగ్ పనులు దాదాపుగా అన్నీ ఆన్లైన్ విధానంలోనే పూర్తవుతున్నాయి. అయినా ఇప్పటికే కొన్ని ప్రత్యేక పనులకు బ్యాంకులు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. అందుకే ఏ నెలలో ఎప్పుడెప్పుడు బ్యాంకులకు సెలవులున్నాయో తెలుసుకోవడం మంచిది. వచ్చే జనవరి నెల బ్యాంకు సెలవులు జాబితాను ఆర్బీఐ విడుదల చేసింది. దీని ప్రకారం బ్యాంకులు మొత్తం 14 రోజులు మూతపడనున్నాయి. ఈ 13 రోజుల్లో రెండు, నాలుగు శనివారాలు, నాలుగు ఆదివారాలతో పాటు రిపబ్లిక్ డే, న్యూ ఇయర్ డే ఉన్నాయి.
జనవరి 2025 బ్యాంకు సెలవుల జాబితా
జనవరి 1 న్యూ ఇయర్ సెలవు
జనవరి 2 న్యూ ఇయర్ సెలవు మిజారంలో, మన్నం జయంతి సందర్భంగా కేరళలో సెలవు
జనవరి 6 గురు గోవింద్ సింగ్ జయంతి హర్యానా, పంజాబ్‌లో సెలవు
జనవరి 11 మిషనరీ డే సెలవు మిజోరాంలో, రెండవ శనివారం
జనవరి 12 ఆదివారం సెలవు
జనవరి 14 మకర సంక్రాంతి ఏపీ, తెలంగాణ, తమిళనాడులో బ్యాంకులకు సెలవు
జనవరి 15 మకర సంక్రాంతి ఏపీ, తెలంగాణ, తమిళనాడులో సెలవు
జనవరి 16 కనుమ ఏపీ, తమిళనాడులో సెలవు
జనవరి 22 మణిపూర్‌లో బ్యాంకులకు సెలవు
జనవరి 25 నాలుగవ శనివారం సెలవు
జనవరి 26 రిపబ్లిక్ డే సెలవు
జనవరి 30 సిక్కింలో సెలవు
Also read: Public Exams: ఇకపై 5, 8 తరగతులకు పబ్లిక్ పరీక్షలు, ఎప్పుడంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.