Prasar Bharati: ప్రసార భారతి అనేది ఒక ప్రముఖ సంస్థ. ఇది దేశవ్యాప్తంగా సమాచారాన్ని అందించేందుకు బాధ్యత వహిస్తుంది. తాజాగా ప్రసారభారతి హైదరాబాద్ లోని సీనియర్ కరస్పాండెంట్ స్థానాన్ని భర్తీ చేసేందుకు అభ్యర్థులను ఆహ్వానిస్తున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా అర్హులైన అభ్యర్థులను ఒక ఒప్పందం ప్రకారం హైదరాబాద్ లో పనిచేసేందుకు నియమించనున్నారు.
ప్రసార భారతి ఈ నోటీసులో సీనియర్ కరస్పాండెంట్ స్థానానికి సంబంధించి వివరాలను ఇచ్చింది. ఈ ప్రకటన ప్రకారం..ఈ పోస్టు హైదరాబాద్ లో రెండేళ్ల పాటు ఒప్పంద ప్రకారం ఉంటుందని పేర్కొంది. ఈ పోస్టులకు గాను నెలలవారీ జీతం రూ. 80వేల నుంచి 1,25,000 వరకు ఉంటుంది. అభ్యర్థులు జర్నలిజం లేదా మాస్ కమ్యూనికేషన్ లో డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా చేసి ఉండాలి. అదనంగా హిందీ, ఇంగ్లీష్ భాషల్లో బైలింగ్వల్ నైపుణ్యం కూడా ఉండాలి. రీజినల్ భాష పరిజ్నానం ప్రాధాన్యంగా ఉంటుంది. ఈ నియామకానికి అభ్యర్థులకు 45ఏళ్లలోపు వయస్సు ఉండాలి. సీనియర్ కరస్పాండెంట్ బాధ్యతలు పత్రికా కథనాలు, ఫైలింగ్ కథనాలు, న్యూస్ రూమ్ సంబంధిత పనులకు నిర్వహించడం వంటి కార్యకలాపాలను పోషిస్తారు.
Also Read: Gold Rate: ట్రంప్ డైలాగ్ ఎఫెక్ట్.. పరుగులు పెట్టిన పసిడి.. ఇంతకీ ట్రంప్ ఏం అన్నాడు?
ఈ కాంట్రాక్టు కేవలం రెండేళ్లు పాటు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అభ్యర్థుల పనితీరును బట్టి ఈ ఒప్పందం పొడిగించుకోవచ్చు. ఒప్పందాన్ని ఒక నెల నోటీసుతో ఎప్పుడు రద్దు చేసే అవకాశం ఉంటుంది. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read: Padma Awards 2025: పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి